చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం
చికెన్‌పాక్స్ అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే ఒక సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇది అంటువ్యాధి, ముఖ్యంగా ఇంతకు ముందు ఈ వ్యాధి రాని లేదా పూర్తిగా టీకాలు వేయని వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు ఈ వైరస్ వల్ల హాని ఉంది. ఈ పిల్లలకు చికెన్ పాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, బొబ్బలుసాధారణంగా 10 నుండి 21 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఇవి దాదాపు 5-10 రోజుల వరకు ఉంటాయి. చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న వారికి ఆకలి, తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం, అలసట వంటివి ఉంటాయి.
పొక్కులను తాకడం, గిల్లడం లేదా గోకడం వంటివి చేయకూడదు
రెండేళ్ళ లోపు పిల్లలకు ఈ వైరస్ వల్ల హాని ఉంది చికెన్‌పాక్స్ ఉన్న వారి తుమ్ము, దగ్గు, శ్లేష్మం లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఈ సమయంలో బొబ్బలు పగలవచ్చు సబ్బుతో స్నానం చేయకూడదు. చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్నప్పుడు, పొక్కులను తాకడం, గిల్లడం లేదా గోకడం వంటివి చేయకూడదు. దానివల్ల శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. యాంటీ-వైరల్ మందులు, లోషన్లు చికెన్‌పాక్స్ నుండి కోలుకోవడానికి సహాయపడవచ్చు. డాక్టర్ రోగి పరిస్థితి, లక్షణాలు, వయస్సు, ఇన్ఫెక్షన్ పరిధి, చికిత్స సమయాన్ని బట్టి యాంటీ వైరల్ మందులను సూచించవచ్చు. వైరస్‌ను బయటకు పంపడానికి వదులుగా ఉన్న బట్టలు ధరించాలి, చల్లని నీటితో స్నానం చేయాలి, నీరు ఎక్కువగా త్రాగాలి.