మీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి.
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ని వదలట్లేదా? దానివల్ల వాళ్ళ మూడ్ పాడవుతోందా? అలసిపోతున్నారా? ఐతే మీ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారని చెప్పుకోవచ్చు. మీ పిల్లలు ఇంటర్నెట్ ని మరీ ఎక్కువగా వాడుతుంటే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. బాధ్యతల నుండి తప్పుకుంటారు: ఫాలోవర్స్ ఎంతమంది పెరిగారు? లైక్స్ ఎన్ని వచ్చాయ్ అనే ఆలోచనలత మీ పిల్లల మెదడు నిండిపోతుంది. సో, నిజ జీవితంలోని బాధ్యతల నుండి తప్పించుకుంటారు. చెప్పిన పని చేయకుండా శుభ్రత పాటించకుండా ఉంటారు. చంచల మనస్తత్వం: ఆన్ లైన్ లో లేకపోతే వాళ్ళ మనసు, మనసులా ఉండదు. మళ్ళీ ఆన్ లైన్ లోకి రాగానే మేఘాల్లో తేలిపోతున్నట్టుగా మారిపోతారు.
ఆనందాలను ఆవిరి చేసి ఆవేశాలను పెంచే ఇంటర్నెట్ బానిసత్వం
ఇంతకు ముందు తమకు ఎంతో ఇష్టమైన పనుల మీద ఉన్న ఆసక్తి రానురాను వారికి తగ్గిపోతుంది. ఆటలాడటం, అభిరుచులు, స్నేహితులతో మాటలు అన్నీ మర్చిపోతారు. ఇంటర్నెట్ లో కనిపించే ప్రపంచాన్ని ప్రేమిస్తూ నిజమైన ప్రపంచం మీద ఆసక్తి కోల్పోతారు. ప్రతీదానికీ చిరాకు పడతారు. ప్రతీదీ ఇంటర్నెట్ లో షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోకూడని వ్యక్తిగత విషయాలు కూడా ఇంటర్నెట్ లో పంచుకుంటారు. భోజనం చేసే ప్రతీసారీ భోజనాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. ఆన్ లైన్ లో షేర్ చేసుకోకపోతే ఆ సంఘటనలను వాళ్ళు ఫీలవ్వరు. మీ పిల్లలను ఆన్ లైన్ లో ఎంతసేపు గడిపారని మీరు అడిగితే వాళ్ళు అబద్ధం చెబుతారు. మీరెంత అడిగినా నిజం చెప్పకుండా మాట దాటేస్తారు.