టాన్సిల్స్ లక్షణాలు, రావడానికి కారణాలు, నిరోధించే మార్గాలు
టాన్సిల్ అనేవి గొంతు వెనక భాగంలో గడ్డల మాదిరిగా ఉంటాయి. లింఫటిక్ కణజాలాల వల్ల ఈ గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలకు బాక్టీరియా, వైరస్ సోకడ్ం వల్ల అవి ఉబ్బుతాయి. ఆ పరిస్థితిని టాన్సిల్లిటిస్ అంటారు. చిన్నపిల్లల్లో ఇది ఎక్కువగా కనబడుతుంది. చాలాసార్లు ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకోకుండానే టాన్సిల్లిటిస్ దానికదే తగ్గిపోతుంది. టాన్సిల్లిటిస్ లక్షణాలు: టాన్సిల్స్ ఉబ్బడం వల్ల గొంతునొప్పి, ఆహారం మింగేటపుడు ఇబ్బంది, గొంతు బొంగురుగా రావడం, జ్వరం, మెడ పట్టేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపు నొప్పి, చెవినొప్పి, తలనొప్పి కూడా ఉంటుంది. జలుబు వల్ల కూడా టాన్సిల్ ఉబ్బుతాయి కాబట్టి జలుబుకు ఉండే లక్షణాలు దీనిలో కనిపిస్తాయి.
టాన్సిల్లిటిస్ రావడానికి కారణాలు, రాకుండా నిరోధించే మార్గాలు
టాన్సిల్లిటిస్ కారణాలు: సాధారణ జలుబు వల్ల టాన్సిల్ గడ్డలు ఉబ్బుతాయి. అలాగే స్ట్రెప్టోకోకస్ బాక్ట్రియా కూడా కారణం అవుతుది. అలాగే కొన్ని వైరస్ లు కారణమవుతాయి. టాన్సిల్లిటిస్ రాకుండా ఉండాలంటే: వ్యక్తిగత శుభ్రత పాటించాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. జలుబు చేసినా, జ్వరం వచ్చినా మీ టూత్ బ్రష్ ని మార్చండి. టాన్సిల్లిటిస్ ని పోగొట్టే ఇంటి వైద్యం : గోరువెచ్చని నీటిని పుక్కిలిస్తే రిలీఫ్ ఉంటుంది. గొంతునొప్పి ఇబ్బంది పెడుతుంటే వేడి వేడి టీ తాగవచ్చు. గొంతునొప్పి ఇబ్బంది పెడుతుంటే ఐస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. ట్రీట్ మెంట్: కొన్నిసార్లు టాన్సిల్స్ మరీ ఉబ్బిపోతే సర్జరీ చేసి వాటిని కత్తిరించాల్సి ఉంటుంది.