Telangana: వింత ఆకృతితో భారీ టమాటా..
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 02, 2026
09:26 am
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా టమాటా అంటే అరచేతిలో ఇమిడిపోయే పరిమాణమే మనకు గుర్తొస్తుంది. కానీ, కుమురంభీం జిల్లాలోని పెంచికల్‌పేట మండలం పరిధిలో ఉన్న బొంబాయిగూడ గ్రామానికి చెందిన రైతు గణపతి ఇంటి పెరటిలో పండిన టమాటా మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వింత ఆకృతిలో పెరిగిన ఆ టమాటా పావుకిలోకు మించిన బరువుతో కాసింది. ప్రత్యేకమైన పొరల నిర్మాణంతో, సాధారణ టమాటాలతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు పెద్దదిగా కనిపిస్తోంది. ఈ టమాటా సాగులో ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించలేదని, పూర్తిగా సహజ విధానంలోనే పండించానని రైతు గణపతి తెలిపారు.