Malaria Vaccine: మలేరియా వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సటీ ఈ టీకాను రూపొందించింది. వచ్చే ఏడాది ఈ టీకా అందుబాటులోకి రానుంది. మూడు డోసుల ఈ వ్యాక్సిన్ 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే ఆర్ 21 మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్, ఘనా, నైజీరియా, బుర్కినా ఫాసోలో ఉపయోగించడానికి లైసెన్సు అందింది. బుర్కినా ఫానో, కెన్యా, మాలి, టాంజానియా దేశాల్లో క్లినికల్ ట్రయల్ నిర్వహణకు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిధులను సమకూర్చింది.
2021లో జీఎస్కే రూపొందించిన తొలి టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం
మొదటి టీకా కంటే ఇది మరింత సమర్థమైందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ పేర్కొన్నారు. కాగా 2021లో జీఎస్‌కే సంస్థ రూపొందించిన తొలి టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది. మలేరియా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టిందని, అందుకే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన మ్యాట్రిక్-ఎం- వ్యాక్సిన్ ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొంటుందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దర్ పునావాలా చెప్పారు. ఆర్ 21 మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పోషించిన పాత్ర అద్భుతమని, ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి తాము ఎదురు చూస్తున్నామని ఆయన వెల్లడించారు.