Page Loader
అబుదాబీలో ప్రాణాంతక మెర్స్‌ వైరస్‌ కేసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ
Write caption hereఅబుధాబిలో ప్రాణాంతక మెర్స్‌ వైరస్‌ కేసు

అబుదాబీలో ప్రాణాంతక మెర్స్‌ వైరస్‌ కేసు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 25, 2023
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెర్స్‌కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)ప్రాణాంతక వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. అబుదాబీలో ఓ 28ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడ్డాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు బాధితుడు సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించి పరీక్షించామని, వారిలో వైరస్‌ గుర్తించలేదని పేర్కొంది. UAE -అల్‌ఐన్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో స్థానిక ఆస్పత్రిలో చేరాడు. అనంతరం పీసీఆర్‌ పరీక్షల్లో మెర్స్‌కోవ్‌గా తేలింది. అతడికి సన్నిహితంగా ఉన్న 108 మందిని పరీక్షించగా ఎవరికీ వైరస్‌ సోకలేదని వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ సోకితే జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. కొవిడ్ సంతతికి చెందిన మెర్స్‌కోవ్‌ ఇప్పటికే బ్రిటన్‌ అమెరికా సహా 27 దేశాల్లో కనిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

28ఏళ్ల యువకుడికి సోకిన వైరస్