LOADING...
వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత
వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత

వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత

వ్రాసిన వారు Stalin
Jul 19, 2023
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

కోవిడ్ పుట్టుకకు కారణమైందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా కొరడా ఝులిపించింది. వుహాన్ ల్యాబ్‌‌కు ఫెడరల్ నిధులను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసిట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

వుహాన్

కోరోనా మూలాలపై చేస్తున్న విచారణకు సహకరించని వుహాన్ ల్యాబ్

జులై 2020నుంచి అమెరికా వుహాన్ ల్యాబ్‌కు ఎలాంటి నిధులు అందించలేదు. కరోనా మూలాలపై కొనసాగుతున్న విచారణ మధ్య బయో సేఫ్టీ పద్ధతులపై పత్రాలను పంచుకోవడంలో వుహాన్ ల్యాబ్ నిరాకరించింది. దీంతో అమెరికా ఇంతటి కఠినమైన నిర్ణయానికి వచ్చింది. ఏడు మిలియన్ల మందిని బలిగొన్న కోవిడ్ పుట్టుక విషయంలో వుహాల్ ల్యాబ్ పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రేతో సహా కొందరు నిపుణులు, కరోనా వుహాన్ ల్యాబ్‌లో ఉద్భవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించడం లేదా ప్రయోగశాలలో జరిగిన ప్రమాదం ద్వారా ఉద్భవించిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇందులో వాస్తవాలను కొనుక్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను చైనా అడ్డుకుంటున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది.