NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో
    తదుపరి వార్తా కథనం
    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో
    భారతావనికి ప్రపంచం సానుభూతి

    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 03, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా సహా ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్ కోరోసి వరకు వరల్డ్ వైడ్ గా దేశాధినేతలు, ప్రముఖులు ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు.

    క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో ఇండియాకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

    ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, జపాన్ దేశ ప్రభుత్వం సహా ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు.

    Details 

    ఆ బాధను మేమూ పంచుకుంటాం: రష్యా ప్రెసిడెంట్

    ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేమూ పంచుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు.

    ఇండియాలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు తమను కలవరపర్చాయని, ఆప్తులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్నారు.

    ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా ఉన్నామని కెనడియన్లు తరఫున కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భరోసా ఇచ్చారు.

    ప్రమాద ఘటనలో భారీగా ప్రాణ నష్టం కలిగించిందని, ఈ దుఃఖసాగర సమయంలో ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు నేపాల్ తరఫున ఆ దేశ ప్రధాని పుష్పకమల్‌ దహల్ సానుభూతిని తెలియజేశారు.

    ఒడిశా రైలు ప్రమాదం విషాదకరమని, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు యూఎన్‌జీఏ ప్రెసిడెంట్ కొరోసి.

    Details 

    ప్రతి ఒక్కరి కోసం తైవాన్ దేశం ప్రార్థిస్తోంది: సాయ్‌ ఇంగ్‌-వెన్‌ 

    దుర్ఘటనలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఘటనలో బంధువులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని పాక్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు.

    ఒడిశా విషాద ఘటన దిగ్బ్రాంతికరమని, ఉక్రెయిన్ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బాధితుల కుటుంబీకులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

    మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    రైలు దుర్ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం తైవాన్ దేశం ప్రార్థిస్తోందని, బాధితులకు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌-వెన్‌ ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    రైలు ప్రమాదం
    ప్రపంచం
    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    తాజా

    Miss World 2025: ఆధ్యాత్మిక నగరి యాదగిరిగుట్టలో.. 'ఇక్కత్‌' వస్త్రాల ప్రాంగణంలో 'ప్రపంచ సుందరి' పోటీదారుల సందడి  తెలంగాణ
    Mayank Yadav: స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌కు గాయం.. లక్నోకు కొత్త బౌలర్ లక్నో సూపర్‌జెయింట్స్
    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    ప్రపంచం

    ప్రపంచ టేబుల్ టెన్నిస్ కు ఎంపికైన తెలంగాణ అమ్మాయి టేబుల్ టెన్నిస్
    పోకో నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే! స్మార్ట్ ఫోన్
    మూడు భారీ ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో ఇస్రో
    రెజ్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ  రెజ్లింగ్

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ ఉజ్బెకిస్తాన్
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025