
వాతావరణ మార్పులతో విజృంభిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా; 129 దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ
ఈ వార్తాకథనం ఏంటి
దోమల ద్వారా సంక్రమించే ఆర్బోవైరస్‌ల వల్ల కలిగే డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.
డెంగ్యూ, చికున్ గున్యా కేసుల పెరుగదలతో పాటు జికా లాంటి కొత్త అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు హెచ్చరించారు. ఈ మూడు కూడా ఏడెస్ ఈజిప్టి దోమల నుంచి సంక్రమించే ఆర్బో వైరస్‌ల వల్ల సంభవిస్తాయి.
ఈ వైరస్‌లు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, కొత్త ప్రదేశానికి వ్యాప్తిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
వెక్టర్ దోమల వ్యాప్తిని సులభతరం చేయడంలో వాతావరణ మార్పు కీలక పాత్ర పోషిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓలో డెంగ్యూ, ఆర్బో వైరస్‌లను సమన్వయం చేసే రామన్ వేలాయుధన్ అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
దోమల వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు అవసరం: డబ్ల్యూహెచ్ఓ
కొత్త ప్రాంతాలలో చికున్‌గున్యా, జికా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతాయనే భయాల నేపథ్యంలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు అవసరమని డబ్ల్యూహెచ్‌ఓలో సాంకేతిక నిపుణులు డయానా రోజాస్ అల్వారెజ్ నొక్కి చెప్పారు.
ఇప్పటికే వ్యాప్తి చెందుతున్న 100దేశాలతో సహా మొత్తం 129దేశాల్లో డెంగ్యూ విజృంభించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.
గత సంవత్సరాలుగా డెంగీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు వేలాయుధన్ తెలిపారు. 2000లో బాధితులు అర మిలియన్ ఉంటే, 2019నాటికి 5.2మిలియన్లకు పెరిగినట్లు చెప్పారు.
కరోనా సమయంలో కేసులు సరిగ్గా నమోదు కాలేదని, అయితే బాధితులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వేలాయుధన్ వెల్లడించారు.
డెంగ్యూకు సమాంతరం చికున్‌గున్యా కూడా విజృంభిస్తోందని, ఇప్పటి వరకు 115దేశాల్లో కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది