ఏదైనా జ్వరం రాగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తున్నారా? ఇప్పుడే ఆపేయండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. అన్ని విషయాలు చిటికెలో తెలిసిపోతున్నాయి. అదే ధైర్యంతో మీక్కొంచెం అనీజీగా అనిపించగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేసే అలవాటు కూడా పెరిగిపోయింది.
కానీ ఇలా చేయడం సరైన పని కాదు. ఎందుకంటే అసిడిటీ కారణంగా మీకు ఛాతిలో నొప్పిగా ఉందనుకోండి, దాన్ని మీరు గూగుల్ చేస్తే, హార్ట్ అటాక్ అని గూగుల్ చూపించే అవకాశం ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది?
రోగలక్షణాలను గూగుల్ వెతకడం వల్ల కలిగే ఇబ్బందులేమిటో చూద్దాం.
తప్పుడు సమాచారం:
ముందుగా చెప్పినట్టు ఎవ్వరైనా ఎలాంటి సమాచారాన్నైనా గూగుల్ లో పంచుకోవచ్చు. అలాంటప్పుడు తప్పుడు సమాచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గూగుల్ లో దొరికిన ప్రతీదీ నిజం కాదు
మానసిక ఆరోగ్యం
యాంగ్జాయిటీని పానిక్ అటాక్స్ ని పెంచే గూగుల్ సమాచారం
మీకున్న రోగ లక్షణాలను గూగుల్ లో వెతికినపుడు మీ మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఎందుకంటే మీకున్న లక్షణాలను పెద్ద రోగంతో సంబంధమున్నట్టుగా గూగుల్ చూపిస్తుంది. దీనివల్ల యాంగ్జాయిటీ పెరిగి పానిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంచి.
మెడికల్ కాలేజీల్లో సంవత్సరాలు చదివే డాక్టర్ల కన్నా గూగుల్ గొప్పది కాదన్న విషయం ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి. ఒక విషయం గురించి వాళ్లకుండే అవగాహన ముందు, ఎన్నో ఇన్ఫర్మేషన్స్ దాచుకుని మనమడిగిన వాటికి ఆన్సర్ గా మరెన్నో సమాధానాలిచ్చే గూగుల్ గొప్ప కాదు.
మీకు రోగ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు గూగుల్ లో వెతకడం మానేసి, ఫోన్ తీసి డాక్టర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అంతేకానీ అనవసర సమాచారానికి అర్థం లేకుండా భయపడవద్దు.