వరల్డ్ కిడ్నీ డే: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన పనులు
మార్చ్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కోసం 2006 నుండి ఈ రోజును జరుపుతున్నారు. ప్రస్తుతం మూత్రపిండాలకు వ్యాధులు రాకుండా ఏ విధంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఇక్కడ చూద్దాం. బీపీని చెక్ చేసుకోండి: అధిక బీపీ కారణంగా మూత్రపిండాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. బీపీ ఎక్కువైనపుడు రక్తనాళాలు సన్నగా మారి మూత్రపిండాలకు రక్తం సరిగ్గా అందదు. అందుకే ఎల్లప్పుడూ బీపీని పెరగనివ్వకుండా చూసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిల అదుపు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినపుడు మూత్రపిండాల మీద పనిభారం ఎక్కువ పడుతుంది. దీనివల్ల మూత్రపిండాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజువారి జీవనశైలిలో మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించవచ్చు.
మెడిసిన్స్ ఉపయోగం, ఎక్కువ బరువు చేసే హాని
మెడిసిన్స్ ఎక్కువ వాడకూడదు: ఆర్థరైటిస్, తలనొప్పికి రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడటం వల్ల మూత్రపిండాలపై చెడు ప్రభావం ఉంటుందని నేషనల్ కిడ్నీ ఫౌడేషన్ తెలియజేసింది. ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ కూడా అతిగా వాడకూడదని పేర్కొంచి. కావాల్సినన్ని నీళ్ళు: కావాల్సినన్ని నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని సోడియం, ఇతర వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. రోజుకు 8గ్లాసుల నీళ్ళు తాగడం ఉత్తమం. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి. బరువు పెరగకుండా చూసుకోవాలి: స్థూలకయాం అనేది మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. అందుకే అధిక కేలరీలు తీసుకుని అధిక బరువు కాకుండా చూసుకోండి. జంక్ ఫుడ్ పక్కన పెట్టండి. ప్రతిరోజు వ్యాయామం చేయండి.