
ఆరోగ్యం: మీరు మసాజ్ ఎందుకు చేయించుకోవాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మసాజ్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. శరీర కండరాలను ఉత్తేజ పర్చడానికి, రక్త ప్రసరణ పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి మసాజ్ ఉపయోగపడుతుంది.
మసాజ్ చేయించుకోవడం ఇప్పుడు చాలా సులభం. ఎయిర్ పోర్ట్స్, హోటల్స్, మాల్స్, హాస్పిటల్స్ లో కూడా మసాజ్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మసాజ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
కండరాల నొప్పిని తగ్గిస్తుంది:
రక్తప్రసరణలో సమస్యల వల్ల కండరాలు బిగుతుగా మారుతుంటాయి. అలాగే కొన్నిసార్లు కండరాలు ఉబ్బుతాయి. వీటిని తగ్గించడానికి మసాజ్ పనిచేస్తుంది.
ఒత్తిడిని, యాంగ్జాయిటీని దూరం చేస్తుంది:
ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ని తగ్గించేసి హ్యాపీ హార్మోన్ సెరెటోనిన్ విడుదలయ్యేలా చేస్తుంది మసాజ్. దీనివల్ల మీలోని ఒత్తిడి దూరమవుతుంది. యాంగ్జాయిటీ మీ దరి చేరదు.
మసాజ్
జీర్ణక్రియను మెరుగుపరిచే మసాజ్
మసాజ్ వల్ల జీర్ణక్రియను మెరుగుపర్చడం సాధ్యమే. టిష్యూ టెక్నిక్ ద్వారా జీర్ణశక్తిని పెంచడానికి మసాజ్ థెరపిస్టులు ట్రై చేస్తారు. అలాగే ఆహారనాళంలోని ఆమ్లం కారణంగా వచ్చే గుండె మంటను మసాజ్ దూరం చేస్తుంది.
రక్తప్రసరణ పెంచుతుంది: శరీర కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. మసాజ్ కారణంగా అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందుతుంది. దానివల్ల శరీరానికి అనవసర నొప్పులు కలగవు. స్విడిష్ మసాజ్ ద్వారా రక్తప్రసరణ పెంచవచ్చు.
నరాల వ్యవస్థను విశ్రాంత పరుస్తుంది: శరీరంలోని అన్ని నరాలను ప్రశాంతంగా మార్చేసే శక్తి మసాజ్ కి ఉంది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది. ఇంకా మీలో చురుకుదనం పెరుగుతుంది. మొత్తంలో చూసుకుంటే శరీర శక్తి పెరుగుతుంది.