ఆహారంలో చక్కెర ను పూర్తిగా వదిలేసిన మసాబా గుప్తా
ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా చక్కెరను వదిలేస్తానని టార్గెట్ పెట్టుకుంది. 21రోజుల పాటు చక్కెరకు సంబంధించిన ఆహారాలు ముట్టుకోనని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ టార్గెట్ లో ఆమె విజయం సాధించింది. 21రోజుల పాటు చక్కెరను వదిలేసాక ఆమె జీవితంలో చాల మార్పులు వచ్చాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మసాబా గుప్తా రాసిన ప్రకారం, ఆమెకు చాక్లెట్స్, స్వీట్స్ అంటే బాగా ఇష్టమట. దానివల్ల తనకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని చెప్పుకొచ్చింది. చక్కెరను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నప్పటి నుండి అసలు స్వీట్స్ వైపు కన్నెత్తి చూడలేదట. తీపి వస్తువులైన బెల్లం, తేనె కూడా ముట్టుకోలేదట. మొబైల్ లో స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ డిలీట్ చేసేసినట్లు తెలిపింది.
చక్కెరను వదిలేయడం వల్ల మసాబా గుప్తా పొందిన ప్రయోజనాలు
షుగర్ ని వదిలేయడం వల్ల తన మెదడు పనితీరు బాగా మెరుగుపడిందనీ, పనిమీద ఫోకస్ పెరిగిందనీ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇంకా శరీరంపై పగుళ్ళు, ఉబ్బసం, మాటిమాటికీ మూడ్ మారిపోవడం తగ్గిపోయిందని, యాంగ్జాయిటీ అసలే లేదని, మోకాలి మీద మరకలు పూర్తిగా పోయాయని, శరీర బరువు తగ్గినట్లు పంచుకుంది. చక్కెర ఆహారాలను తీసుకోకపోవడం వల్ల కలిగే లాభాలు రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. కాలేయ సంబంధ వ్యాధులు దరిచేరవు. గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా, ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చక్కెర తినాలన్న కోరికను కంట్రోల్ చేసుకోవాలంటే చక్కెరకు బదులు అవకాడో, మాంసం, గుడ్లు, పాల పదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి.