నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి
చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. హాట్ చాక్లెట్స్ కనిపిస్తే అందరికీ నోరూరుతుంది. ఈరోజు అమెరికాలో నేషనల్ హాట్ చాక్లెట్ డే జరుపుకుంటారు. సో, అద్భుతమైన రుచితో చాక్లెట్ రెసిపీలను ఇంటి దగ్గరే తయారు చేద్దాం పీనట్ బటర్ మార్ష్ మల్లో చాక్లెట్: కోకో పౌడర్, చక్కెర, నీళ్ళను కలిపి స్టవ్ మీద బాగా వేయించాలి. దీనికి కొన్ని పాలు కలిపి మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ మీద నుండి దించి, పీనట్ బట్టర్, చాక్లెట్ చిప్స్ అందులో వేయాలి. మిశ్రమం మొత్తం మంచి పేస్ట్ లాగా తయారయ్యే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించి, కొంచెం సముద్రపు ఉప్పు, మార్ష్ మల్లోలను ఆ చాక్లెట్ మీద చిలకరించాలి.
హాట్ చాక్లెట్ డే రోజున ఇంట్లోనే తయారు చేసుకోగలిగే మరిన్ని రెసిపీస్
రెడ్ వైన్ హాట్ చాక్లెట్: అరకప్పు పాలను, పావు కప్పు చాక్లెట్ చిప్స్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి ఒక కప్పు రెడ్ వైన్ కలుపుకుని కొంచెం వేడి చేసి హ్యాపీగా ఆరగించండి. న్యూటెల్లా హాట్ చాక్లెట్: రెండుకప్పుల పాలను వేడిచేసి కొంత నుటెల్లాను కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి జల్లుకుని విప్డ్ క్రీమ్ కలుపుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. స్పైసీ హాట్ చాక్లెట్: హాట్ చాక్లెట్ ని కొంచెం కారంగా తయారు చేద్దాం. 6కప్పుల పాలు, 285గ్రాముల డార్క్ చాక్లెట్ చిప్స్, పావు కప్పు దాల్చిన చెక్క, చిటికెడు మిరియాల పొడిని ఒక పాత్రలో వేసి, బాగా కలపాలి అంతే.