ఆహారానికి మరింత రుచిని అందించే జామ్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి
చిప్స్, బ్రెడ్స్, కాల్చిన చికెన్, చికెన్ 65, మటన్ ఫ్రై లాంటి ఆహార పదార్థాల అంచుకు జామ్ ఉంటే వాటి రుచి మరింత పెరుగుతుంది. ఐతే ఈ జామ్ లని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంట్లో తయారు చేసుకోగలిగే కొన్ని జామ్ ల గురించి తెలుసుకుందాం. ఆపిల్ జామ్: ఇది ఈజీగా తయారు చేయవచ్చు. కొన్ని ఆపిల్ ముక్కలను కోసి ఒక పాత్రలో వేసుకోవాలి. ఆ తర్వాత చక్కెర, నీళ్ళు పోసి చక్కెర కరిగిపోయేంత వరకు మరిగించాలి. ఆపిల్స్ పూర్తిగా చిక్కటి ద్రావణంలా మారేంత వరకు తక్కువ మంటతో మరిగిస్తూనే ఉండాలి. ఇప్పుడు నిమ్మరసం, కొన్ని దాల్చిన చెక్కలు వేసి చిక్కగా మారిన తర్వాత వేరే పాత్రలోకి తీసుకుంటే సరిపోతుంది.
ఇంట్లో తయారు చేసుకోగలిగే మరికొన్ని జామ్స్
రేగుపళ్ల జామ్: రేగుపండులోని గింజలను తీసేసి ఒక పాత్రలో ఆ గుజ్జును వేసి, దానికి నీళ్ళు కలిపి మరిగించాలి. చక్కెర, నిమ్మరసం కలిపాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో రేగుపళ్ళ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. అలా మరిగించి చిక్కగా మారిందని అర్థం అయ్యాక ఆ పాత్రని పొయ్యి మీద నుండి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత టేస్ట్ చేయండి. బ్లూ బెర్రీ జామ్: బూ బెర్రీ గుజ్జు తీసి, చక్కెర, నిమ్మరసం, వెనీలా కలిపి ఒక పాత్రలో మరిగించండి. మిశ్రమంలా తయారవ్వగానే 30నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉంచండి. ఆ తర్వాత పాత్రను పక్కన దించేసి 10నిమిషాలు చల్లారనివ్వండి.