రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి
కొంతమందికి ఆహారం వండుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం రెస్టారెంట్ల మీదే ఆధారపడతారు. అలా కాకుండా ఈజీగా వండుకోగలిగే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆవిరితో ఉడికించిన ఆహారాలు వండుకోవడానికి ఈజీగా ఉంటాయి. ప్రస్తుతం వాటి రెసిపీలు చూద్దాం. ఉడకబెట్టిన పాలకూర: పాలకూరను చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాత్రలో వేసి, అందులో నీళ్ళు పోసి ఉడికించండి. ఆకులు ఉడికిన తర్వాత వేరే పాత్రలోకి పాలకూరను తీసుకోండి. దానికి ఉప్పు, వెల్లుల్లి పొడి, వెన్న, నిమ్మరసం, నల్లమిరియాలు కలిపి బాగా మిక్స్ చేసి, ప్లేట్ లోకి తీసుకుని మీక్కావాల్సిన వారికి అందించండి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోండి.
ఆవిరితో సులభంగా వండుకోగలిగే మరికొన్ని వెరైటీలు
గోధుమ రవ్వ ఇడ్లీ: గోధుమ రవ్వ, ఉప్పు, నీళ్ళు, కొత్తిమీరను ఒక పాత్రలో వేసి, మూతపెట్టి 10నిమిషాలు పక్కన పెట్టండి. ఆవాలు, జీలకర్ర, మినపపప్పు, కరివేపాకు, ఇంగువ, కాజు లను ఒక పాత్రలో వేసిన నూనెలో వేయించాలి. గోధుమ రవ్వ మిశ్రమంలో వేయించిన దాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న బంతుల్లా చేసి ఇడ్లీ పాత్రలో వేసి ఉడికించాలి. మసాలా వడ: శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు తీసుకుని 2గంటలు నీళ్ళలో నానబెట్టాలి. నీళ్ళను పారబోసి పప్పును మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేయండి. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, సోంఫు గింజలను పేస్ట్ లో కలపండి. చిన్నబంతుల్లా చేసి నూనే పూసిన ఇడ్లీ పాత్రల్లో వేసి ఉడికిస్తే సరిపోతుంది.