కొబ్బరి చక్కెర గురించి మీకు తెలుసా? చక్కెరలోని రకాలు తెలుసుకోండి
సాధారణంగా మన ఇళ్ళలో వాడే చక్కెర గురించే అందరికీ తెలుస్తుంది. చక్కెరలో చాలా రకాలున్నాయి. వేరువేరు రకాల చక్కెరలను వేరు వేరు ఆహారాల్లో ఉపయోగిస్తారు. వైట్ షుగర్: ఇంట్లో వాడే చక్కెర రకం ఇది. దీన్నే టేబుల్ షుగర్ అని కూడా పిలుస్తారు. చెరుకు లేదా చక్కెర దుంపలను రిఫైన్ చేసి ఈ చక్కెరను తయారు చేస్తారు. బ్రౌన్ షుగర్: సుక్రోజ్ లేదా మొలాసిస్ నుండి తయారయ్యే ఈ చక్కెర, బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కరీబియన్, యూరప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చాక్లెట్ కేక్స్, ఫ్రూట్ కేక్స్ తయారు చేయడానికి బ్రౌన్ షుగర్ ని ఎక్కువగా వాడతారు.
డయాబెటిస్ తో బాధపడేవారికి తినగలిగే చక్కెర
కేన్ షుగర్: సాధారణ చక్కెరలో కంటే ఎక్కువ పొషకాలు కేన్ షుగర్ లో ఉంటాయి. చెరుకు రసాన్ని తీసి, ఆ రసాన్ని ఉడికించి రిఫైన్ చేయని మొలాసిస్ ని బయటకు తీసి చక్కెరను తయారు చేస్తారు. నీటిలో కరిగిపోయే ఈ చక్కెరను బేకరీ ఆహారాల్లో ఎక్కువగా వాడతారు. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు కూడా తినవచ్చు. కొబరి చక్కెర: ఈ చెక్కరను కొబ్బరి పువ్వుల నుండి తయారు చేస్తారు. ఇది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ చక్కెరలో చాలా పోషకాలు ఉంటాయి. జింక్, కాల్షియం, ఐరన్ ఉండడం వల్ల శరీరానికి ఆరోగ్యం అందుతుంది.