చలికాలం: డయాబెటిస్ నుండి గుండె సంబంధ వ్యాధుల వరకు మెంతులు చేసే ప్రయోజనాలు
మనకు ఆరోగ్యాన్నిచ్చే చాలా పదార్థాలు మన కిచెన్ లోనే ఉంటాయి. కానీ మనం మాత్రం అది మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, ఏవేవో తింటుంటాం. సాధారణంగా కిచెన్ లో కనిపించే మెంతులు, మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతుల మొలకలు కూడా మన బాడీని అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. అసిడిటీ: కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఛాతిలో మంటగా అనిపించే ఈ వ్యాధి నుండి దూరం కావాలంటే నానబెట్టిన మెంతులను రోజూ ఉదయం తినండి. కొన్ని రోజుల్లోనే దీని ప్రభావం తెలుస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో: రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా మెంతులు సాయపడతాయి.
మెంతుల వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు
డయాబెటిస్ తో బాధపడేవారు మెంతులు కలిపిన నీళ్ళను తాగితే మంచి ఫలితం ఉంటుంది. మెంతి మొలకలను తింటే ఇంకా బాగుంటుంది. నానబెట్టిన మెంతుల్లో కంటే మెంతి మొలకల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది: నానబెట్టిన మెంతులను తినడం వల్ల మలబద్దకం, అసిడిటీ వంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ప్రకృతి పరంగా మెంతులు శరీరానికి వేడి చేసే ఆహారాలు. అందుకే వీటివల్ల దగ్గు, జలుబు తగ్గిపోతాయి. మెంతులను పొడి రూపంలో తీసుకున్నా, నానబెట్టి తిన్నా లేదా మొలకల రూపంలో తిన్నా అవి జలుబు, దగ్గులాంటి ఇబ్బందులను దూరం చేస్తాయి. కొవ్వును తగ్గిస్తుంది: గుండె నాళాల్లో కొవ్వు పేరుకుని గుండెపోటుకు కారణం కాకుండా మెంతులు సాయం చేస్తాయి.