బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు తగ్గించుకుంటున్నారా? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
శరీర బరువు పెరగడానికి కారణం కార్బో హైడ్రేట్ ఆహారాలే అని చెప్పి, వాటిని తీసుకోవడం మానేస్తుంటారు. ఐతే వాటిని పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.
ఏదైనా అతిగా ఆచరించడం అనర్థాలకు దారి తీస్తుంది. కార్బోహైడ్రేట్లను శరీరానికి అందకుండా చేస్తే అనేక అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది.
పోషకాహార నిపుణుల ప్రకారం ఒక రోజులో 60 నుండి 130 గ్రాముల కార్బో హైడ్రేట్లు తీసుకోవాలి. కీటో లాంటి డైట్ పాటించే వారు 30గ్రాముల కంటే తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటారు.
దానివల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. కొత్త డైట్ విధానాలకు మెదడు ఒక్కోసారి తొందరగా సర్దుకుపోదు. అలాంటి సమయాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గడం
కార్బోహైడ్రేట్లు తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యలు
బలహీనత, అలసట: కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి సరిగ్గా అందకపోతే మీరు బలహీనంగా మారతారు. ఏ పని చేయాలన్నా అలసిపోయినట్లుగా ఫీలవుతారు.
మలబద్దకం: ఇది మరొక సమస్య. కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉండే ధాన్యాలు, బీన్స్ తీసుకోరు కాబట్టి పేగుల కదలికలు సరిగ్గా ఉండవు. దాంతో మలబద్దకం సమస్య మొదలవుతుంది.
కండరాలు పట్టేయడం: కార్బోహైడ్రేట్లలో పొటాషియం, కాల్షియం, సోడియం వంటి మూలకాలు ఉంటాయి. ఇవి తగ్గిపోవడం వల్ల కండరాలు పట్టేస్తుంటాయి. ఇంకా దానివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
చెడు వాసన: నోటి నుండి చెడు వాసన రావడం, ఏది తిన్నా రుచిగా అనిపించకపోవడం వంతి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాదు యాంగ్జాయిటీ, తలనొప్పివంటి సమస్యలు చుట్టుకుంటాయి. అందుకే శరీరానికి కార్బోహైడ్రేట్లను అందించండి.