
Prabhas Hanu : దీపావళి వేళ ప్రభాస్ - హను సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, అప్డేట్ వచ్చేసింది
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ వరుస పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రాజాసాబ్ సినిమాలో కనిపించనున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం "ఫౌజీ" అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమా ఆర్మీ, యుద్ధం బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ప్రేమకథతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ తప్ప ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ రాలేదు.
వివరాలు
యుద్ధంలో సింగిల్ గా నిల్చున్నవాడు
అయితే, ఇటీవల దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేసి, చిన్నఅప్‌డేట్ కూడా ఇచ్చారు. ఆ పోస్టర్‌లో ప్రభాస్ నీడే ప్రధానంగా కనిపిస్తుంది, అన్ని తుపాకులు ఆ నీడవైపు దూకుతున్నట్టు చూపించారు. పోస్టర్‌లో ఇచ్చిన ప్రకారం, "యుద్ధంలో సింగిల్ గా నిల్చున్నవాడు" అనే కొటేషన్ ఇచ్చారు. అలాగే, "పద్మవ్యూహంలో విజయ పార్థ" అనే హిందీ కొటేషన్ తో పోస్టర్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. తదుపరి అప్డేట్ అక్టోబర్ 22న అందిస్తామని ప్రభాస్ టీమ్ ప్రకటించింది. ఆ రోజు సినిమాకు ఫౌజీ అనే టైటిల్ కూడా అధికారికంగా ప్రకటిస్తారని అభిమానులు ఊహిస్తున్నారు. ఒక్క పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
----------------------
— Mythri Movie Makers (@MythriOfficial) October 20, 2025
पद्मव्यूह विजयी पार्थः
----------------------#PrabhasHanu DECRYPTION BEGINS ON 22.10.25 🔥
Happy Diwali ✨
Rebel Star #Prabhas #Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma… pic.twitter.com/TDUXpaSmZW