ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?
ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు. ఈ డిజార్డర్ కారణంగా మనిషి శరీరంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది. ప్రస్తుతం ఈటింగ్ డిజార్డర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. శరీరంపై ప్రభావం: ఈటింగ్ డిజార్డర్ వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండదు, మానసికంగా బలహీనమవుతారు. ఎమోషనల్ గా కూడా ఇబ్బంది పడతారు. శరీర సంబంధ విషయాల్లో గుండె, కాలేయం, కడుపు, పళ్ళు, ఎముకలు, రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఈ డిజార్డర్ ఏ వయసు గల వారిలోనైనా కలుగుతుంది. కొంతమందికి టీనేజ్ లోనే వస్తుంది.
ఈటింగ్ డిజార్డర్ లోని రకాలు, రావడానికి కారణాలు, ట్రీట్ మెంట్ విధానాలు
ఇందులో 6రకాలున్నాయి. అనోరెక్సియా నెర్వోసా: వీళ్ళు ఊరికే బరువు చెక్ చేసుకుంటూ ఉంటారు. బులిమియా నెర్వోసా: టైమ్ ప్రకారం తింటారు కానీ ఎక్కువ తింటారు. బింజ్: ఏ టైమ్ లో అయినా తింటారు, ఎక్కువ తింటారు. పైకా: తినదగినవి కాని వాటిని తింటారు. మరో రకం వాళ్ళకు అసలు తినాలని అనిపించదు. ఇంకో రకం వాళ్ళు తిన్న ఆహారాన్ని ఉమ్మేస్తారు. జన్యుపరంగా ఈ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. బాల్యంలో జరిగిన హృదయ విదారక సంఘటనలు, అమ్మానాన్నల ఒత్తిడి, తోటి వారి ఒత్తిడి, యాంగ్జాయిటీ, డిప్రెషన్, ఓసీడీ వల్ల రావచ్చు. దీన్నుండి బయటకు రావాలంటే చాలా కష్టపడాలి. డాక్టర్లు మందులు ఇస్తారు. కొన్నిసార్లు పోషకాహార నిపుణులు ఇచ్చే సలహాల వల్ల ఇది తగ్గుతుంది.