బిహార్: వార్తలు

తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు ​​పంపింది.

IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

06 Mar 2023

సీబీఐ

జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు.

బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు.

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

09 Jan 2023

దిల్లీ

ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు

విమానాల్లో అసభ్యకర సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎయిర్ ఇండియాలో తోటి మహిళా ప్రయాణికులపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే.. ఇండిగో ఫ్లైట్‌లో మరో ఘటన జరిగింది.

'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.

Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్

బిహార్‌కు చెందిన రాజు రామ్ అనే వ్యక్తి డ్రీమ్11 బెట్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కేవలం రూ.49లో బెట్టింగ్ పెట్టి రూ.కోటి జాక్ పాట్ కొట్టేశాడు. కొన్ని లక్షల మందిని ఓడించి మరీ.. రాజు రామ్ ఈ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

26 Dec 2022

కోవిడ్

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.