LOADING...
Chhath Festival: నేటి నుంచి 4 రోజుల పాటు 'ఛత్ ఫెస్టివల్'.. పండుగ ప్రాముఖ్యత ఇదే!
నేటి నుంచి 4 రోజుల పాటు 'ఛత్ ఫెస్టివల్'.. పండుగ ప్రాముఖ్యత ఇదే!

Chhath Festival: నేటి నుంచి 4 రోజుల పాటు 'ఛత్ ఫెస్టివల్'.. పండుగ ప్రాముఖ్యత ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ప్రస్తుతంలో ఓట్ల పండుగతో పాటు అత్యంత ప్రాచీన హిందూ పండుగ అయిన ఛత్ ఫెస్టివల్‌ కూడా వేదికగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత, సందడిపూరిత వాతావరణం కనిపిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలు రాష్ట్రం బయట ఉన్నా తమ సొంత గ్రామాలకు చేరుకొని అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా భక్తులకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Details

ఛత్ పండుగ ప్రత్యేకత

ఛత్ పండుగ అనేది పురాతన ఇండో-నేపాల్ హిందూ పండుగ. ఇది తూర్పు భారతదేశం, దక్షిణ నేపాల్‌లోని ప్రధానంగా జరుపుకునే పండుగ. భారతదేశంలో బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. అలాగే, నేపాల్‌లోని కోషి, గండకి, బాగ్మతి, లుంబిని, మాధేష్ ప్రావిన్స్లలో కూడా ఈ పండుగ ప్రాచుర్యం పొందింది. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఫెస్టివల్‌ను జరుపుకుంటారు. ఛత్ పండుగను దీపావళి తర్వాత ఆరు రోజులకు జరుపుతారు. దీనిని ''సూర్య షష్టి వ్రతం''గా పిలుస్తారు. భక్తులు మూడు రాత్రులు, నాలుగు పగళ్లు వ్రతం పాటిస్తూ ఉపవాసం ఉంటారు, పవిత్ర సాన్నం సిద్ధం చేసి సూర్యుడికి నమస్కారాలు చేస్తారు. వ్యక్తిగత కోరికలు నెరవేర్చాలని సూర్యుడిని ప్రార్థిస్తారు.

Details

నైవేద్యాలు 

1. తేకువా - గోధుమ పిండి, బెల్లం, నెయ్యి ఉపయోగించి కరకరలాడేలా తయారు చేసే తీపి చిరుతిండి. 2. రసబలి - చదును చేసిన బియ్యాన్ని తియ్యటి పాలలో నానబెట్టి యాలకులు, ఎండిన పండ్లతో రుచిగా తయారు చేసే డెజెర్ట్. 3. కాసర్ (లడ్డూ) - బియ్యం పొడి లేదా గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసే చిన్న సైజులోని పవిత్ర లడ్డూ. 4. బియ్యం లడ్డూ (పీఠ) - బెల్లం, కొబ్బరిని ఆవిరితో ఉడికించి తయారు చేసే నైవేద్యం. ఈ వంటకాలు కేవలం నైవేద్యాలు మాత్రమే కాకుండా, ఛత్ పండుగలో స్వచ్ఛత, భక్తి, సాంస్కృతి గొప్పతనాన్ని సూచిస్తాయి. పర్యావరణ అనుకూలతతో కూడిన మతపరమైన పండుగగా కూడా ఈ పండుగను పర్యావరణవేత్తలు అభివర్ణిస్తారు.

Details

విశిష్టత 

ఛత్ పూజ సూర్య దేవుడికి అంకితం. ఛత్ మాతను కూడా పూజిస్తారు. పిల్లలకు అనారోగ్యాలు, వ్యాధుల నుంచి రక్షణ, దీర్ఘాయుష్యం, మంచి ఆరోగ్యం లభించడానికి ఈ పండుగ ప్రధాన ఉద్దేశ్యం. అక్టోబర్ 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు భక్తిశ్రద్ధతో నిర్వహించబడుతుంది. ఉదయం 5-7 గంటల సమయంలో చెరుకు కర్రలను కలిపి మండపం ఏర్పాటుచేసి, 12-24 దీపాలను వెలిగించి, తేకువా మరియు సీజనల్ ఫ్రూట్స్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. తదుపరి రోజు ఉదయం 3-4 గంటల మధ్య ఈ ఆచారం పూర్తయిన తర్వాత సూర్యుడి ఉదయంతో నమస్కారాలు చేసి వ్యక్తిగత కోరికలను తీర్చాలని ప్రార్థిస్తారు. నైవేద్యాలను అంకితం చేస్తారు. ఈ కార్యక్రమాలు ప్రతి రోజు నది ఒడ్డునే నిర్వహిస్తారు.