LOADING...
Bihar Assembly Elections 2025: బిహార్‌లో ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం.. నవంబర్ 11న పోలింగ్
బిహార్‌లో ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం.. నవంబర్ 11న పోలింగ్

Bihar Assembly Elections 2025: బిహార్‌లో ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం.. నవంబర్ 11న పోలింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ దశలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండో దశలో NDA, మహాఘఠ్ బంధన్ (మహా కూటమి)కి చెందిన అనేక ప్రముఖ నాయకుల భవిష్యత్తు తేలనుంది. ప్రచారం ముగిసిన తర్వాత, ఈ జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు లేదా రోడ్ షోలు పూర్తిగా నిషేధం కింద ఉంటాయి.

Details

 37,013,556 మంది ఓటర్లు 

రెండో దశలో ఓటింగ్ జరగనున్న 20 జిల్లాలు ఇవీ: పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, శివహార్, మధుబాని, సుపాల్, అరారియా, కిషన్‌గంజ్, పూర్నియా, కతిహార్, భాగల్‌పూర్, బంకా, జముయి, నవాడా, గయా, ఔరంగాబాద్, జెహానాబాద్, అర్వాల్, కైమూర్, రోహ్తాస్. బీహార్‌లో మొత్తం 38 జిల్లాలున్నాయి. రెండో దశలో 1,302మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1,165 మంది పురుషులు, ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 37,013,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. పోలింగ్ కోసం 45,399 కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి,అందులో 40,073గ్రామీణ, 5,326పట్టణ బూత్‌లు ఉన్నాయి. నవంబర్ 6న తొలి దశలో 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Details

నవంబర్ 14న ఫలితాలు

బిహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నారు. రెండో దశ ప్రచారంలో అధికార NDA కూటమి, ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ కూటమి నేతల హోరాహోరీ ఎన్నికల ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాధ్ సింగ్, ఇతర BJP ప్రముఖ నేతలు పలు సభల్లో పాల్గొన్నారు. ప్రతిపక్షం తరఫున AICC అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ముఖ్యనేత, MP ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. NDA తరఫున ప్రధాని మోడి, BJP జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాధ్ సింగ్ ప్రధానంగా ప్రచారంలో పాల్గొన్నారు.