LOADING...
Sunil Naik: ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ
ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

Sunil Naik: ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వ కాలంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి,హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో గుంటూరులోని మొబైల్‌ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని గుంటూరు పోలీసులు జారీ చేసిన నోటీసులకు సునీల్‌ నాయక్‌ స్పందించకపోవడంతో,అతడిని అదుపులోకి తీసుకోవడానికి జిల్లా ఎస్పీ దామోదర్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇటీవల బిహార్‌ రాజధాని పట్నాకు వెళ్లింది. అయితే ట్రాన్సిట్‌ వారెంట్‌ ఇవ్వడానికి అక్కడి హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈపరిణామాల నేపథ్యంలో గుంటూరు మొబైల్‌ కోర్టును పోలీసులు ఆశ్రయించి అరెస్ట్‌ వారెంట్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయగా,కోర్టు వారెంట్‌ జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సునీల్‌ నాయక్‌కు గుంటూరు కోర్టు షాక్

Advertisement