Loading...
IndiGo: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. గల్ఫ్ దేశాలకు ఇండిగో విమానాలు, పూర్తి జాబితా ఇదే
గల్ఫ్ దేశాలకు ఇండిగో విమానాలు, పూర్తి జాబితా ఇదే

IndiGo: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. గల్ఫ్ దేశాలకు ఇండిగో విమానాలు, పూర్తి జాబితా ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ముఖ్యమైన సమాచారం వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రభావితమవుతున్నప్పటికీ, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యప్రాచ్యంలో ఉన్న 8 దేశాలకు పరిమిత సంఖ్యలో విమానాలు నడపాలని ఇండిగో నిర్ణయించింది. యుద్ధం ప్రారంభమై 11 రోజులు గడిచినా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ అంతర్జాతీయ విమాన నెట్‌వర్క్‌ను క్రమంగా పునరుద్ధరిస్తున్నామని ఇండిగో యాజమాన్యం తెలిపింది.

వివరాలు 

మార్చి 11న నడిచే విమానాల పూర్తి జాబితా

ప్రస్తుత భద్రతా పరిస్థితులు,ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా మార్చి 11, 2026న కింది మార్గాల్లో విమానాలు నడుస్తాయని ఇండిగో ప్రకటించింది.

లండన్ - నెదర్లాండ్స్ రూట్లు:

ముంబై ↔ లండన్,

ముంబై ↔ ఆమ్‌స్టర్‌డామ్,

మాంచెస్టర్ ↔ ఢిల్లీ.

సౌదీ అరేబియా రూట్లు:

హైదరాబాద్ ↔ జెద్దా,

హైదరాబాద్ ↔ మదీనా,

ముంబై ↔ జెద్దా,

బెంగళూరు ↔ జెద్దా,

కోజికోడ్ ↔ జెద్దా.

యూఏఈ (UAE) రూట్లు:

ముంబై ↔ దుబాయ్,

ఢిల్లీ ↔ దుబాయ్,

ముంబై ↔ అబుదాబి,

హైదరాబాద్ ↔ అబుదాబి,

హైదరాబాద్ ↔ షార్జా,

హైదరాబాద్ ↔ రాస్ అల్ ఖైమా,

ముంబై ↔ ఫుజైరా.

వివరాలు 

ఒమన్ రూట్లు:

ముంబై ↔ మస్కట్,

హైదరాబాద్ ↔ మస్కట్.

ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

యుద్ధ పరిస్థితుల వల్ల పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం ఉందని ఇండిగో హెచ్చరించింది. అందుకే ప్రయాణికులు ముందుగానే కొన్ని విషయాలు గమనించాలని సూచించింది.

షెడ్యూల్ మార్పులు:

భద్రతా కారణాల వల్ల విమానాల సమయాలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఫ్లైట్ స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు 

సహాయం కోసం:

రద్దైన లేదా రీషెడ్యూల్ అయిన విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇండిగో బృందాలు పనిచేస్తున్నాయి. ఏవైనా సందేహాలుంటే కస్టమర్ కేర్ నంబర్ +91 124 6173838 కు సంప్రదించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ఆకాశాన్ని తాకుతున్న టికెట్ ధరలు.. ఇంధన ప్రభావం

యుద్ధ ప్రభావం విమాన టికెట్ ధరలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరడంతో జెట్ ఫ్యూయల్ (ATF) ధరలు గత రెండు వారాల్లోనే సుమారు 150శాతం పెరిగాయి.

దీంతో ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు లాంగ్-హాల్ రూట్లలో టికెట్ ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచాయి.

మరోవైపు ఇంధన ధరలు పెరగడం, అలాగే గత ఏడాది సరిహద్దు వివాదాల కారణంగా పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించలేకపోవడం భారత విమానయాన సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.

ప్రస్తుతం గల్ఫ్ దేశాల మార్గాలపై ఎక్కువగా ఆధారపడుతున్నఇండిగో,ఎయిర్ ఇండియా,స్పైస్‌జెట్ వంటి సంస్థలకు ఈ యుద్ధ పరిస్థితులు ఆర్థికంగా భారీ నష్టాలను కలిగించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ADVERTISEMENT