తదుపరి వార్తా కథనం
Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తున్న ఎన్డీఏ.. కార్యకర్తల్లో సంబరాల వెల్లువ!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 14, 2025
09:27 am
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపుతోనే ముందంజలోకి వచ్చిన ఎన్డీఏ, అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలైన తర్వాత మరింత వేగంగా దూసుకెళ్లింది. తాజా గణాంకాల ప్రకారం, మొత్తం 243 స్థానాలున్న బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 మ్యాజిక్ ఫిగర్‌ను అధికార కూటమి దాటేసింది. ప్రస్తుతం ఎన్డీఏ మొత్తం 139 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. జేడీయూ-బీజేపీ కూటమి ఈ బలమైన ఆధిక్యంతో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వెళ్లే పరిస్థితులు స్పష్టమవుతుండగా, బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు, విపక్ష ఇండియా కూటమి 66 స్థానాల్లో కొనసాగుతోంది.