LOADING...
Tej Pratap Yadav: మూడేళ్లుగా కరెంటు బిల్లు చెల్లించని తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ 
మూడేళ్లుగా కరెంటు బిల్లు చెల్లించని తేజ్‌ ప్రతాప్‌ యాదవ్

Tej Pratap Yadav: మూడేళ్లుగా కరెంటు బిల్లు చెల్లించని తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ కి ఎదురైన ఓటమి, పార్టీ లోపలి కుటుంబ వివాదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన మరో అంశం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తేజ్ ప్రతాప్‌కు చెందిన పట్నాలోని ఓ ప్రైవేటు ఇంటి కరెంట్‌ బిల్లు గత మూడు సంవత్సరాలుగా చెల్లింపుకాకుండా పెండింగ్‌లో ఉందని సమాచారం. ఈ పెండింగ్ బకాయిలు జరిమానాలతో కలిపి రూ.3.6 లక్షలు దాటాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ ప్రభుత్వ నివాసంలో ఉంటున్నారు.

Details

రూ.3లక్షలు దాటిన బకాయిలు

అయితే ఆయన వ్యక్తిగత ఇల్లు ఉన్న పట్నాలో చివరిసారిగా చెల్లించిన విద్యుత్ బిల్లు 2022 జులైలో అని తెలుస్తోంది. ఆ తర్వాత మూడేళ్లుగా చెల్లింపులు జరగకపోవడంతో మొత్తం బిల్లు జరిమానాలతో కలిపి రూ.3,61,000కు చేరింది. తేజ్ ప్రతాప్‌ పేరు మీద మరొక విద్యుత్ కనెక్షన్ కూడా ఉందని విద్యుత్తు శాఖ డేటా చెబుతోంది. ఆ కనెక్షన్‌కు సంబంధించిన బకాయిలు కూడా జరిమానాలతో కలిపి రూ.3,24,974 వద్ద నిలిచాయి. ఈ ఘటన రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Details

పోస్ట్‌పెయిడ్ మీటర్‌ కొనసాగించడంపై వివాదం

బకాయిలు పేరుకుపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రీపెయిడ్ మీటర్లను అమలు చేయగా, తేజ్ ప్రతాప్ మాత్రం తన వ్యక్తిగత నివాసానికి పోస్ట్‌పెయిడ్ మీటర్‌నే కొనసాగించడం వివాదానికి దారితీసింది. నియమాల ప్రకారం రూ.25,000 కంటే ఎక్కువ బకాయి ఉన్న ఏ పోస్టుపెయిడ్‌ కనెక్షన్‌ అయినా వెంటనే డీయాక్టివేట్ చేయాలి. కానీ తేజ్ ప్రతాప్‌ పేరు మీద ఉన్న కనెక్షన్‌ల బకాయిలు రూ.3 లక్షలు దాటినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement