తదుపరి వార్తా కథనం
Bihar Assembly Elections: బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రారంభం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 11, 2025
08:46 am
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) నేడు ప్రారంభమయ్యాయి. మొత్తం 20 జిల్లాల్లోని 122 సీట్లపై ఈ పోలింగ్ జరుగుతోంది. దాదాపు 3,70,13,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. రెండో దశ కోసం 45,000 కి పైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దిల్లీలో ఇటీవల సంభవించిన పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వద్ద అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు.