LOADING...
Bihar Elections Phase 1: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ 
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

Bihar Elections Phase 1: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. 3.75 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ దశలో 1,314 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు ఓటర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ జాబితాలో ఇండియా బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, అలాగే బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ వంటి ప్రముఖ నాయకులు కూడా ఉన్నాయి.

వివరాలు 

ఓటర్లకు ప్రధాని మోదీ సందేశం 

ఈ దశ ఓటింగ్ మహాఘట్‌బంధన్‌కు కీలకంగా భావించబడుతోంది. ఎందుకంటే, 2020 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో మహాఘట్‌బంధన్ 63 స్థానాలు గెలిచింది, కాగా బీజేపీ, జేడీయూ కలిపి 55 స్థానాలను సాధించాయి. పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఓటర్లను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. "నేడు బిహార్‌లో ప్రజాస్వామ్య వేడుక తొలి దశ. ఈ దశలో ఓటు వేయనున్న అందరికి నా విజ్ఞప్తి.. ఉత్సాహంగా, బాధ్యతతో ఓటు వేయండి. ప్రత్యేకంగా, మొదటిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు నా శుభాకాంక్షలు," అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

Advertisement