Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హీట్.. కట్టుదిట్టమైన భద్రతా వాతావరణంలో 47.6% పోలింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 47.62 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. ఈ దశలో ప్రముఖ నాయకులు కూడా తమ ఓటు వేశారు. జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, పుర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ రెండో విడతలో ఓటు వేసిన వారిలో ఉన్నారు. ఈ దశలో మొత్తం 20 జిల్లాలకు చెందిన 122 నియోజకవర్గాల్లో sఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 3,70,13,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండో విడత ఎన్నికల కోసం 45 వేలకు పైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.
Details
బిహార్ లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
ఇదిలా ఉండగా, ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడు ఘటన నేపథ్యంలో బిహార్‌లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అంతేకాకుండా, ఎన్నికల నేపథ్యంలో బిహార్ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ సరిహద్దు మూసివేత 72 గంటల పాటు కొనసాగనుందని ఆ రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు