LOADING...
Udit Narayan: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు

Udit Narayan: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తాజాగా ఓ వివాదంలో నిలిచారు. ఆయన తొలి భార్య రంజన ఝా బిహార్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, అలాగే రెండో భార్యపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. 1996లో వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులంతా కలిసి తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ తనకు తెలియకుండానే గర్భాశయాన్ని తొలగించారని రంజన ఝా పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

గతేడాది కూడా వివాదంలో ఉదిత్‌ నారాయణ్

గతేడాది కూడా ఉదిత్‌ నారాయణ్‌ వివాదంలో చిక్కుకొన్న విషయం తెలిసిందే. ఓ కాన్సర్ట్ సందర్భంగా తనతో ఫోటోలు దిగేందుకు వచ్చిన మహిళా అభిమానిని ఆయన ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు, పలువురు విమర్శకులు తీవ్రంగా స్పందించారు. అయితే ఈ ఘటనపై ఆయన వివరణ ఇస్తూ, తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేస్తూనే తాను ఇలా చేశానని అన్నారు

వివరాలు 

మీసాల పిల్లా..' పాటతో మళ్లీ ప్రేక్షకులను అలరించారు

'అందమైన ప్రేమరాణి', 'అందాల ఆడబొమ్మ', 'కీరవాణి రాగంలో', 'పసిఫిక్‌లో దూకేయ్‌మంటే', 'అమ్మాయే సన్నగా' వంటి ఎన్నో మధుర గీతాలతో ఉదిత్ నారాయణ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఇటీవలి కాలంలో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలోని 'మీసాల పిల్లా..' పాటతో కూడా ఆయన మళ్లీ ప్రేక్షకులను అలరించారు.

Advertisement