LOADING...
Bihar Assembly Elections: కోటి ఉద్యోగాలు,ఉచిత విద్య,మెట్రో సేవలు: బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల
బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల

Bihar Assembly Elections: కోటి ఉద్యోగాలు,ఉచిత విద్య,మెట్రో సేవలు: బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని మరింత పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వాగ్దానాల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బిహార్ పాలక ఎన్డీయే కూటమి శుక్రవారం తమ ఎన్నికల ప్రకటన పత్రాన్ని (ఎన్డీయే మ్యానిఫెస్టో) విడుదల చేసింది. ముఖ్యంగా వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. పట్నాలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో 'సంకల్ప పత్రం' పేరుతో భాజపా (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంయుక్తంగా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ నేత చిరాగ్ పాసవాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివరాలు 

మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశాలు: 

రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్య అందించే ప్రణాళిక కోటి మంది మహిళలను "లఖ్‌పతి దీదీలు"గా మార్చడం లక్ష్యం.. అంటే వార్షికంగా రూ.1 లక్ష వరకు ఆదాయం పొందేలా చేయడం మహిళలు స్వయం ఉపాధి వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం ఈబీసీ వర్గాలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు రాష్ట్ర సామాజిక-ఆర్థిక స్థితిని సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

వివరాలు 

మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశాలు: 

కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏటా రూ.9 వేల పెట్టుబడి సాయం, ఇది మూడు విడతల్లో చెల్లింపు బిహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణం, అలాగే నాలుగు ప్రధాన నగరాల్లో మెట్రో రైలు సేవల ప్రారంభం వచ్చే ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీలు స్థాపన గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం