Neha Sharma : పాపం రామ్ చరణ్ హీరోయిన్.. తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం.. అయినా తప్పని ఓటమి!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి దారుణ ఓటమిని చవిచూసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్‌గా ఉన్న రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ, తన తండ్రి అజిత్ శర్మ ప్రచారంలో పాల్గొంది. నేహశర్మ చిరుత సినిమాతో సినీ ప్రపంచంలో పరిచయం అయ్యి, కేవలం 'చిరుత', 'కుర్రాడు' సినిమాల్లో నటించింది. ఇటీవల హాయ్ నాన్న సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది నేహశర్మ తండ్రి అజిత్ శర్మ బీహార్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. భగల్‌పూర్ నుంచి మూడు సార్లు కాంగ్రెస్ ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలుపు కోసం నేహశర్మ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది.
Details
సోషల్ మీడియాలో వీడియో షేర్
ఆ ప్రచారం వీడియోను సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. అయితే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా, హీరోయిన్ గెస్ట్ ప్రచారం చేసినా అజిత్ శర్మ బీజేపీ కాంకిడేట్ రోహిత్ పాండే చేతుల్లో ఓడిపోయారు. ఫలితంగా అజిత్ శర్మ దాదాపు 13,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ ఘటనతో నేహశర్మ తన తండ్రి కోసం చేసిన ప్రచారం వైరల్‌గా మారింది.