LOADING...
Zaira Wasim: బిహార్‌ సీఎం హిజాబ్‌ వివాదం.. స్పందించిన దంగల్‌ నటి
బిహార్‌ సీఎం హిజాబ్‌ వివాదం.. స్పందించిన దంగల్‌ నటి

Zaira Wasim: బిహార్‌ సీఎం హిజాబ్‌ వివాదం.. స్పందించిన దంగల్‌ నటి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ మహిళ హిజాబ్‌ను లాగిన ఘటనపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనపై తాజాగా దంగల్ సినిమా నటి జైరా వసీమ్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళ గౌరవం,మర్యాదలు ఆటపాటలుగా చూడరాదని నీతీశ్‌ను ఉద్దేశించి ఆమె ఘాటైన విమర్శలు గుప్పించారు. "ఒక మహిళ గౌరవం,మర్యాదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట వస్తువులు కావు,ముఖ్యంగా బహిరంగ వేదికలపై అయితే మరీ కాదు. ఒక మహిళ హిజాబ్‌ను ఇంత తేలికగా లాగడమే కాకుండా, ఆ సమయంలో ఆయన నిర్లక్ష్యంగా నవ్విన తీరు చూసి ఓ మహిళగా నాకు తీవ్ర ఆగ్రహం కలిగింది. అధికారమంటే హద్దులు దాటేందుకు ఇచ్చిన అనుమతి కాదు" అని ఆమె 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు.

వివరాలు 

సీఎం నీతీశ్‌పై విమర్శలు

ఈ ఘటనపై ఆ మహిళకు బిహార్ సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో పాటు నీతీశ్ కుమార్‌ను ఆమె ట్యాగ్ చేశారు. పట్నాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో, ఓ మహిళకు ఆయుష్ సర్టిఫికెట్‌ను నీతీశ్ కుమార్ అందజేశారు. ఆ సమయంలో ఆమె హిజాబ్‌ను ఆయన లాగిన ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో,నీతీశ్‌పై విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, నీతీశ్ మానసిక స్థితి సరిగా లేదంటూ ఆర్జేడీ పార్టీ విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది క్షమించరాని చర్యగా పేర్కొంటూ, నీతీశ్ తక్షణమే రాజీనామా చేయాలని 'ఎక్స్' వేదికగా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైరా వసీమ్ చేసిన ట్వీట్ 

Advertisement