LOADING...
Village of Bachelors: ఆ ఊరి నిండా పెళ్లి కాని ప్రసాదులే.. 50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లిల్లు లేవు,భార్యలూ లేరు!
50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లిల్లు లేవు,భార్యలూ లేరు!

Village of Bachelors: ఆ ఊరి నిండా పెళ్లి కాని ప్రసాదులే.. 50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లిల్లు లేవు,భార్యలూ లేరు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన చుట్టూ సమాజంలో ఎన్నో వింతలు, విశేషాలు, వెరైటీలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేస్తే, మరికొన్ని సరదా సరదాగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి విచిత్రమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమీటంటే.. మన దేశంలోని ఓ గ్రామంలో యువకులకు చాలా ఏళ్లుగా పెళ్లిళ్లు జరగడం లేదట. ఆ గ్రామం పేరు వింటేనే పక్క గ్రామాల వారు సంబంధం గురించి మాట్లాడటానికే భయపడుతున్నారు. మరి ఆ ఊరు ఏది? అక్కడి యువకుల పెళ్లి కల ఎందుకు నెరవేరడం లేదు? ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

'బ్యాచిలర్స్ విలేజ్'

బిహార్ రాష్ట్రం, పాట్నా నగరం నుండి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్వాన్ కలాన్ (Barwan Kalan) అనే గ్రామం ఇది. నగరాల హడావిడికి పూర్తిగా దూరంగా, అడవుల మధ్య ఒంటరిగానే కనిపించే ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో కూడా పెళ్లి కాని యువకులే ఉన్నారు. ఇది ఇటీవల ప్రారంభమైన సమస్య కాదు. గత యాభై సంవత్సరాలుగా ఈ గ్రామంలో పెళ్లిళ్లు జరగడం లేదు. అందుకే ఈ ఊరిని చాలామంది 'బ్యాచిలర్స్ విలేజ్' అని పిలుస్తుంటారు. ఇంకా కొందరైతే కొంచెం హాస్యంగా 'పెళ్లి కాని ప్రసాదుల ఊరు' అని కూడా అంటారు. అయితే ఈ పరిస్థితికి గల ముఖ్య కారణం గ్రామ పరిస్థితులేనని తెలుస్తోంది.

వివరాలు 

రోడ్డు,బస్సు సౌకర్యం కూడా లేని ఊరు 

బర్వాన్ కలాన్ గ్రామంలో ఇంతవరకు సరైన రోడ్డు సౌకర్యం,విద్యుత్ వ్యవస్థ లేవు. ముఖ్యంగా ఇక్కడ మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా లేదు. అంటే ఫోన్ పనిచేయదు,బయటివారితో మాట్లాడే అవకాశమూ లేదు. అందువల్ల ఆ గ్రామంలోని వారికి పిల్లనిస్తే ఎప్పుడైనా వెళ్లి రావడానికి కనీసం రోడ్డు,బస్సు సౌకర్యం కూడా లేదని, చివరికి ఫోన్ మాట్లాడుకునే చాన్స్ కూడా ఉండదని సంబంధాలు కుదుర్చుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంతేకాకుండా, ఈ గ్రామానికి గొప్ప చరిత్ర కూడా ఉంది. గుప్త వంశకాలం నాటి ఆలయాలు, మట్టితో చేసే కళాకృతులు,అన్నీ ఈ ఊరి ప్రత్యేకతలు. అంతేకాకుండా,ఈ గ్రామానికి గొప్ప చరిత్ర కూడా ఉంది. గుప్త వంశకాలం నాటి ఆలయాలు,మట్టితో చేసే కళాకృతులు,నూలు నేస్తాలు.. అన్నీ ఈ ఊరి ప్రత్యేకతలు.

వివరాలు 

 50 ఏళ్లకి  ఆ ఊర్లో అడుగుపెట్టిన వధువు 

కానీ ఆధునిక సౌకర్యాల లోపం ఆ అందాలకు నీళ్లు పోశాయి. పెళ్లి చేసుకోవాలంటే యువకులు తమ పూర్వీకుల ఇళ్లను వదిలి, కొండల దిగువ ప్రాంతాల్లో కొత్తగా జీవితం మొదలుపెట్టాల్సిన పరిస్థితి. ప్రభుత్వం రోడ్డు వేస్తామని మాట ఇచ్చినా, ఆ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎన్నికల సమయంలో "రోడ్డు వేసేవరకు పెళ్లి చేసుకోం" అని ప్రమాణాలు చేసిన నేతలు, ఎన్నికలు గెలిచిన తర్వాత మాటలు మరిచిపోయారు. దీంతో గ్రామస్తుల ఆశలు ఆవిరైపోయాయి. 2017లో 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఓ వధువు ఆ ఊర్లో అడుగుపెట్టింది. ఆమెను ఆహ్వానించేందుకు ఊరంతా కలిసి స్వయంగా రోడ్లు బాగుచేసుకోవడం గమనార్హం. మరి, ఇప్పటికైనా ఆ ఊరు తలరాత మారుతోందో లేదో చూడాలి.