LOADING...
Bihar Elections బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల.. రాఘోపుర్‌ నుంచి తేజస్వీ.. 
రాఘోపుర్‌ నుంచి తేజస్వీ..

Bihar Elections బిహార్‌ ఎన్నికలకు 143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల.. రాఘోపుర్‌ నుంచి తేజస్వీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ దగ్గరపడుతున్నప్పటికీ, విపక్ష దేశ కూటమి 'మహాగఠ్‌బంధన్'లో సీట్ల పంపిణీ పూర్తి కాలేదు. ఈ సందర్భంలో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య సీట్ల పట్ల మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో,లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ సోమవారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.ఆర్జేడీ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బిహార్ ఎన్నికల రెండో విడత నామినేషన్ల గడువు నేటితో ముగియబోతున్న నేపథ్యంలో, ఆర్జేడీ అధికారిక జాబితా విడుదల చేయడం ప్రత్యేకంగా గమనార్హం. తొలి విడత పోలింగ్ నామినేషన్ల గడువు అక్టోబర్ 17న పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరి రోజు.

వివరాలు 

 తేజస్వి,రాహుల్‌ గాంధీ మధ్య దూరం 

అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఆర్జేడీనేత తేజస్వి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. ఫలితంగా మహాగఠ్‌బంధన్ ఇప్పటివరకు సీట్ల పంపిణీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అదనంగా, తొలి విడత పోలింగ్ జరగనున్న 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దిగించడం గమనార్హం. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

143 మందితో ఆర్జేడీ జాబితా విడుదల