Bihar: వరి వ్యర్థాలతో బంగాళాదుంప పంట… జీరో-టిల్లేజ్ పద్ధతికి విజేంద్ర సక్సెస్ స్టోరి
ఈ వార్తాకథనం ఏంటి
వరి, గోధుమ వంటి పంటల చేతికొచ్చిన తర్వాత పనిచేయని భాగాలను సాధారణంగా రైతులు కాల్చేస్తారు. దీని కారణంగా వాతావరణంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. అయితే, దున్నకం లేని (జీరో-టిల్లేజ్) పద్ధతిని ప్రవేశపెట్టిన తరువాత, చాలా రైతులు పంటల వ్యర్థాలను తదుపరి పంటకు ఉపయోగకరమని గ్రహించారు. బిహార్‌లోని నలందా జిల్లా కుకుర్‌బర్ గ్రామానికి చెందిన రైతు విజేంద్ర చౌధరి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆయన తన పొలంలోని ఎండిన వరి వ్యర్థాలపై నేరుగా విత్తనాలు, ఎరువులు వేసి బంగాళాదుంపలు సాగిస్తున్నారు.
వివరాలు
దున్నకం లేకుండా, ఖర్చులు తగ్గించి…
ఈ పద్ధతిలో పొలాన్ని తవ్వకుండా, పంట వ్యర్థాలను తొలగించకుండా సాగు చేయడానికి ప్రత్యేక డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీని వల్ల దున్నకం కోసం చేసే శ్రమ, ఇంధన ఖర్చులు తగ్గుతాయి. నీటి అవసరము కూడా తక్కువగా ఉంటుంది. పంట వ్యర్థాలు విత్తనాలను రక్షించే ఒక పైకప్పుగా పనిచేస్తాయి. కలుపు మొక్కల పెరుగుదల అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. విజేంద్ర తన పొలంలో 30 కిలోల బంగాళాదుంప విత్తనాలను ఉపయోగించి, వాటిని మట్టితో కాకుండా 10 అంగుళాల వెగుగా కప్పారు. మొదట దీనిని చూసి పరిహాసపడ్డ పొరుగు రైతులు, ఇప్పుడు ఆయన పొలంలో పుష్కలంగా పండిన పంటను మరియు ఎనిమిది రెట్ల లాభాలను చూస్తే ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు.