Bihar Results: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం… ఇంకొన్ని గంటల్లోనే తీర్పు!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ శాసనసభ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం మొదలుపెట్టారు. బిహారీల తీర్పు ఏ దిశగా ఉన్నదో ఇంకొన్ని గంటల్లో స్పష్టమవనుంది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 67.13 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ భారీ పోలింగ్ నేపథ్యంలో ఎవరికీ అధికార వరం దక్కనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్డీయే కూటమి వైపే మొగ్గుచూపినా తుది ఫలితం ఎటువైపు ఉండబోతుందో అన్న ఆసక్తి పెరిగింది. అభివృద్ధి-శాంతిభద్రతలు అంటూ ఎన్డీయే ప్రచారం సాగించగా... ఉపాధి, ఓట్ల చోరీ ఆరోపణలు, వలసలు వంటి అంశాలతో మహాగఠ్‌బంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Details
ఎన్నికల ముఖ్య వివరాలు
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 2 ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వు సీట్లు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్: 122 మొత్తం ఓటర్లు: 7.45 కోట్లు — పురుషులు 3.92 కోట్లు, మహిళలు 3.50 కోట్లు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. రెండు విడతల్లో కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది పురుషుల పోలింగ్: 62.98% మహిళల పోలింగ్: 71.78% పోలింగ్ తేదీ: నవంబర్ 6 స్థానాలు: 121 ఓటర్లు: 3.75 కోట్లు అభ్యర్థులు: 1314 పోలింగ్ శాతం: 65+
Details
రెండో విడత
పోలింగ్ తేదీ: నవంబర్ 11 స్థానాలు: 122 ఓటర్లు: 3.70 కోట్లు అభ్యర్థులు: 1302 పోలింగ్ శాతం: 69+ ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓట్ల చోరీ ఆరోపణలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, అభివృద్ధిలో వెనుకబాటు, శాంతిభద్రతలు ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి.
Details
కూటముల వారీగా పోటీ చేసిన స్థానాలు
ఎన్డీయే జేడీయూ — 101 భాజపా — 101 లోక్‌జనశక్తి (రాంవిలాస్) — 28 హిందుస్థానీ అవామ్ మోర్చా (హామ్) — 06 రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) — 06 మఢౌరాలో లోక్‌జనశక్తి (రాంవిలాస్) అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరించడంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్‌కు ఎన్డీయే మద్దతు ప్రకటించింది.
Details
మహాగఠ్‌బంధన్
ఆర్జేడీ — 143 కాంగ్రెస్ — 61 సీపీఐ(ఎంఎల్)ఎల్ — 20 వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ — 12 సీపీఐ — 09 సీపీఎం — 04 ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ — 03 జనశక్తి జనతాదళ్ — 01 స్వతంత్రులు — 02 (కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ కూడా ఉంది) ఇతర పార్టీలు జన్ సురాజ్ పార్టీ — 238 బీఎస్పీ — 130 ఆప్ — 121 ఏఐఎంఐఎం — 25 రాష్ట్రీయ లోక్‌జనశక్తి — 25 ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) — 25
Details
ప్రచారాస్త్రాలు — కూటముల హామీలు
ఎన్డీయే ప్రచారం అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు, మౌలిక వసతుల అభివృద్ధి నీతీశ్ సుపరిపాలన, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లాలూ హయాంలో జంగల్‌రాజ్, అవినీతి ఆరోపణలను ప్రధానంగా ఎత్తిచూపింది యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు * 1 కోటి మహిళలను 'లఖ్‌పతి దీదీ'లుగా తీర్చిదిద్దడం ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమల పార్కుల ఏర్పాటు
Details
మహాగఠ్‌బంధన్ ప్రచారం
ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం ప్రధాన అంశాలు ఓటర్ల జాబితా SIR, ఓట్ల చోరీ అంశాలను ప్రచారంలో వినియోగం నీతీశ్ సర్కార్‌పై వ్యతిరేకత, వలసలు కీలకాంశాలు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం * పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ మహిళలకు నెలకు ₹2500 ఆర్థిక సాయం
Details
కీలక నేతలు — పోటీ చేసిన స్థానాలు
తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) — రాఘోపుర్ సామ్రాట్ చౌధరీ (భాజపా) — తారాపూర్ విజయ్ కుమార్ సిన్హా (భాజపా) — లఖిసరాయ్ మైథిలీ ఠాకుర్ (భాజపా) — అలీనగర్ ప్రేమ్ కుమార్ (భాజపా) — గయా టౌన్ తేజ్‌ప్రతాప్ యాదవ్ (జేజేడీ) — మహువా బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ) — సుపౌల్ తార్‌కిశోర్ ప్రసాద్ (భాజపా) — కఠిహార్ రాజేశ్ కుమార్ (కాంగ్రెస్) — కుటుంబ