తదుపరి వార్తా కథనం

Bihar Elections: బిహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 15, 2025
01:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) సమయంలో జేడీయూ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో 57 స్థానాల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసిన సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం, జేడీయూ మొత్తం 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించింది. ఆ క్రమంలో మొదటి జాబితా ద్వారా 57 మంది అభ్యర్థులను బరిలోకి విడుదల చేసింది.
Details
బలమైన అభ్యర్థుల ప్రకటన
రాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్‌పుర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్‌బార్సా నుంచి రత్నేష్ సదా, మోకామా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుష్వాహాలు పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ జాబితా ద్వారా జేడీయూ తన అభ్యర్థుల పటిష్టతను, పార్టీలో స్థిరమైన నాయకత్వాన్ని చూపుతూ, బరిలో బలమైన ప్రతిభావంతులను ముందుకు తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.