LOADING...
Bihar Elections: ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం.. బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను 
ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం.. బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను

Bihar Elections: ప్రశాంత్‌ కిశోర్‌ కీలక నిర్ణయం.. బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీకి దూరమయ్యారు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పార్టీ కోసం పనిచేస్తానని, తాను మాత్రం పోటీ చేయనని పీకే తెలిపారు. "ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయానికి నేను పూర్తి మద్దతునిస్తూ కట్టుబడి ఉన్నాను. రాఘోపుర్‌ ఎమ్మెల్యేగా తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రయోజనాల కోసంనే నేను ఎన్నికల్లో దూరంగా ఉంటున్నాను. కాబట్టి, నేను పోటీకి వస్తే పార్టీ కార్యకలాపాలపై నా దృష్టి మళ్ళి అవకాశం ఉంది " అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

వివరాలు 

నీతీశ్ మళ్లీ సీఎం కాలేరు 

అలాగే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ సుమారు 150 సీట్లను గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. హంగ్‌ అసెంబ్లి ఏర్పడితే ఏ కూటమికి మద్దతిస్తారు అనే ప్రశ్నకు, "అది అసాధ్యం" అని పీకే స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. "వచ్చే ఎన్నికల్లో జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా రావడం కష్టం.ఎన్డీయే ఓటమి తప్పదు. నీతీశ్ కుమార్ మళ్లీ సీఎం కావడం కష్టమే. ఇక ఇండియా కూటమి పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదు. కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి" అని పీకే చెప్పారు.

వివరాలు 

మాఫియా, అవినీతి మీద కఠిన చర్యలు

తమ పార్టీ అధికారంలోకి వస్తే, మాఫియా, అవినీతి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి కొన్ని రోజుల్లోనే సుమారు 100 అవినీతి పాలనలో ఉన్న నేతలు, అధికారులను గుర్తించి చర్యలు చేపడతామని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 6, 11 తేదీల్లో జరగనుంది. ఫలితాలు నవంబరు 14న వెల్లడికానున్నాయి.