Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే ప్రజంజనం.. గెలుపు వెనుక ఉన్న పది కారణాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో ఉత్కంఠల నడుమ జరిగిన హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్డీయే కూటమి మరోసారి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బిహార్ ఓటర్లు మళ్లీ నితీశ్ కుమార్ నాయకత్వానికే పట్టం కట్టారు. కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు బదులు ప్రజలు మళ్లీ ఎన్డీయేను ప్రాధాన్యపరిచారు. ఒకవైపు వివాదాస్పద ఓటరు జాబితా సవరణలు, మరోవైపు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం, ఇంకోవైపు కులాధారిత రాజకీయాలు—ఈ మొత్తం రాజకీయ గందరగోళం మధ్య కూడా ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇంత ప్రతికూల వాతావరణం, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించిన సందర్భంలో కూడా ఎన్డీయే ఎలా గెలిచింది? ప్రజలు మళ్లీ బీజేపీ-జేడీయూ కూటమిని ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకుందాం.
Details
1. కుల సమీకరణాల్లో ఎన్డీయే ఆధిపత్యం
బీహార్ అంటే కుల ప్రభావం. అక్కడ అభివృద్ధికీ, నాయకత్వానికీ కూడా కులమే ప్రమాణం. ఈ వాస్తవాన్ని ఎన్డీయే పూర్తిగా అర్థం చేసుకుని సోషల్ ఇంజినీరింగ్‌ను ఖచ్చితంగా అమలు చేసింది. OBCలో 63%, EBCలో 58%, SCలో 49%, అగ్రకులాల్లో 65% మంది ఓటర్లు ఎన్డీయే వైపు మొగ్గు చూపారు. మహాఘట్‌బంధన్‌కు కేవలం ముస్లిం-యాదవ ఓటర్లే ఆధారం కాగా, మిగతా అన్నివర్గాల్లో ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టిక్కెట్ల కేటాయింపులో కూడా క్యాస్ట్ కాంబినేషన్‌ను ప్రామాణికంగా అమలు చేయడం కూటమికి పెద్ద ప్లస్ అయ్యింది.
Details
2. మహిళా ఓటర్లే నిజమైన 'కింగ్ మేకర్స్'
ఈసారి రికార్డు స్థాయిలో మహిళా ఓటింగ్ నమోదైంది. మొత్తం 2.52 కోట్ల మహిళా ఓటర్లలో మెజారిటీ ఎన్డీయేకే ఓటేశారు. ఇది నితీశ్ ప్రభుత్వ మహిళా పథకాల ఫలితం మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.4 కోట్ల మహిళలకు ₹10,000 నగదు, ఉచిత సైకిల్ పథకం, పంచాయతీల్లో 50% రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్, ఉచిత విద్యుత్, మహిళా సంక్షేమ పథకాల కింద ₹2 లక్షల సాయం. ఈ పథకాలు నితీశ్‌పై విశ్వాసాన్ని పెంచి, ఎన్డీయేకు ఘన విజయాన్ని అందించాయి.
Details
3. మోడీ ఫ్యాక్టర్ & డబుల్ ఇంజిన్ ప్రభుత్వం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించింది. ఉగ్రవాదంపై ఆయన చేసిన సందేశం, అభివృద్ధి నినాదాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. కేంద్రం బీహార్‌కు కేటాయించిన 1.62 లక్షల కోట్ల అభివృద్ధి ప్యాకేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, మౌలిక సదుపాయాల మెరుగుదల—ఈ మొత్తం 'డబుల్ ఇంజిన్ సర్కార్' ప్రయోజనాలను ప్రజల్లో బలంగా నాటాయి. ఇదే ఎన్డీయేకు ఓట్ల వర్షం కురిపించింది.
Details
4. నితీశ్ మార్క్ రాజకీయాలు
20 ఏళ్ల పాలన తర్వాత కూడా యాంటీ-ఇంకంబెన్సీని నియంత్రించడం చిన్న విషయం కాదు. నితీశ్ కుమార్ అదే చేశారు. కేంద్రంతో మంచి సంబంధాలు, నిధుల సమర్థ వినియోగం, రోడ్లు, నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదల— ఇవి ఆయనకు 'సుషాసన్ బాబూ' ఇమేజ్‌ను మళ్లీ తెచ్చాయి. తన బలాబలాలు తెలుసుకుని, రాజకీయంగా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ రాజీ పడాలో తెలుసుకోవడం కూడా ఆయన విజయంలో కీలకం.
Details
5. కూటమి సమన్వయం-పూర్తి వ్యూహం
బీహార్‌లో రాజకీయాలు కూటముల చుట్టూనే తిరుగుతాయి. ఈ విషయంలో ఎన్డీయే అత్యంత సమన్వయంతో పని చేసింది. BJP—పట్టణాలు, యువత, మధ్యతరగతిపై దృష్టి JDU—గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, కుర్మీ-అహిర్ వర్గాలపై ఫోకస్ చిన్న పార్టీలను కూడా కూటమిలో నిలబెట్టడం ద్వారా ఓట్లు చీలకుండా చూసుకుంది. మహాఘట్‌బంధన్‌తో పోల్చితే ఎన్డీయేలో ఐక్యత ఎక్కువగా కనిపించింది.
Details
6. బూత్ లెవల్ మేనేజ్‌మెంట్—ఎన్డీయే స్పెషలిటీ
బూత్ స్థాయిలో ఎన్డీయే అత్యంత బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది. ప్రతి బూత్‌కు 12 మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి— ఓటర్లను గుర్తించడం, పోలింగ్ రోజున ఓటింగ్ నిర్వహించడం, గ్రౌండ్ నెట్‌వర్క్‌ను యాక్టివ్‌గా ఉంచడం— ఇలా RSS-BJP-JDU కలిసి శక్తివంతమైన కేడర్‌తో ఎన్నికలను నడిపించాయి.
Details
7. హామీల వెల్లువ
ఎన్నికల సమయంలో ఎన్డీయే హామీలు ప్రతి వర్గాన్నీ ఆకట్టుకున్నాయి: ఒక కోటి ఉద్యోగాలు మెగా స్కిల్ సెంటర్లు మహిళలకు ₹2 లక్షల సాయం 7 ఎక్స్‌ప్రెస్‌వేలు 10 ఎయిర్‌పోర్ట్‌లు PM కిసాన్-MSP గ్యారెంటీ 50 లక్షల ఇళ్లు ఉచిత విద్యుత్ ఈ హామీలు ఓటర్లను భారీగా ఆకట్టుకున్నాయి.
Detail
8. 'జంగిల్ రాజ్' భయం
1995-2005 ఆర్జేడీ పాలనలో చెలరేగిన నేరాలు, కిడ్నాప్‌లు, అవినీతిని ఎన్డీయే ఈసారి ప్రధాన ఆయుధంగా ఉపయోగించింది. మహాఘట్‌బంధన్ వస్తే మళ్లీ ఆ రోజులు వస్తాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడేలా చేసింది. మోదీ ఈ అంశాన్ని బలంగా ప్రచారం చేయడంతో ఓటర్లపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. 9. మహాఘట్‌బంధన్ లోపాలు—అంతర్గత కలహాలు కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీల మధ్య సీట్ల పంపకాల్లోనే విభేదాలు బయటపడ్డాయి. 12 స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్స్, అభ్యర్థుల ఉపసంహరణలు, జేఎంఎం అసంతృప్తి, సమన్వయ లోపం—ఇవి మొత్తం కూటమి బలహీనతను బయటపెట్టాయి. ఇది ఎన్డీయేకు పరోక్షంగా లాభించింది.
Details
10. ఆశించినంత ప్రభావం చూపని ప్రశాంత్ కిషోర్
పీకే కొత్త పార్టీ జన్ సురాజ్ ప్రజల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. అభ్యర్థుల బీజేపీలోకి వెళ్లడం, అంతర్గత సమస్యలు—ఇవన్నీ పార్టీ బలహీనతకు దారి తీశాయి. పేకే ఓట్లు చీల్చకుండా ఉండటమే కూడా ఎన్డీయేకు ప్రయోజనమైంది. ఈ పది అంశాలే నితీశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి మళ్లీ అధికారాన్ని అందించాయి. రెండు దశాబ్దాల పాలన తర్వాత కూడా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అభివృద్ధి-నిర్వహణ-సుస్థిరత అంశాలను ముందుకు తెచ్చినందువల్లే బీహార్ మరోసారి ఎన్డీయే వైపే మొగ్గు చూపింది.