Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ అంచనాలు ప్లాప్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్‌లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు. అనేక రాష్ట్రాల్లో తన స్ట్రాటజీలతో పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చినట్టు చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్, ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిగా తప్పుదోవ పట్టించారు. ఎన్నికలకు ముందు నుంచీ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం తప్పదని, ఈసారి బీహార్‌లో మార్పు ఖాయమని, ప్రజలు జన్ సురాజ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన పదేపదే ప్రకటించారు. అయితే తుది ఫలితాలు వెలువడుతున్న కొద్దీ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారింది.
Details
సున్నా స్థానాలకే పరిమితం
ఎన్నికల రోజు ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే పోస్టల్ బ్యాలెట్లలో జన్ సురాజ్ పార్టీ రెండు స్థానాల్లో స్వల్ప ఆధిక్యం సాధించినా, అది కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ సున్నా స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ప్రభావం చూపడంలో విఫలమైంది. దీంతో ప్రశాంత్ కిషోర్ అంచనాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆయన చెప్పినట్లుగా ప్రజలు మార్పు వైపు వెళ్లక, సర్వేలే సూచించినట్లు ఎన్డీఏ కూటమికి భారీగా మద్దతు లభించింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 181 స్థానాల్లో ముందంజలో పయనిస్తుండగా, మహాఘట్‌బంధన్ కూటమి 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీహార్ ప్రజలు ప్రభుత్వ మార్పు కంటే, ప్రస్తుత కూటమిని మరోసారి ఎన్నుకున్న దృశ్యం కనిపిస్తోంది.