బిహార్: వార్తలు

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్ 

బిహార్‌లోని నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయిన 3 ఏళ్ల బాలుడిని ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు.

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బిహార్‌లోని నలందలో పొలంలో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు

దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చీలికను నిరోధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

లాఠీఛార్జ్ లో మరణించిన బీజేపీ కార్యకర్త.. టీచర్ల పోస్టింగ్స్ నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

బిహార్ రాజధాని పాట్నలో రాజకీయ అలజడులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ శ్రేణులపై పోలీసులు జరిపిన లాఠిఛార్జ్ లో ఓ కార్యకర్త మరణించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అగ్గిరాజుకుంది.

మోదీపై లాలూ చురకలు.. ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండకూడదని హితవు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఐక్య రాగం వినిపిస్తున్నాయి.

బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే

బెంగళూరులో జులై 13, 14తేదీల్లో జరగాల్సిన ప్రతిపక్షాల రెండోదఫా సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

25 Jun 2023

బీజేపీ

బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు 

బిహార్‌లోని మాధేపురా జిల్లా మురళిగంజ్‌లో జరిగిన బీజేపీ మీటింగ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి.

'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం బిహార్‌‌ పాట్నలోని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యాలయం సడకత్‌ ఆశ్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

23 Jun 2023

పాట్న

పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా?

దేశ రాజకీయాలో కీలక పరిణామంగా భావించే ప్రతిపక్ష నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు నేతలు శుక్రవారం బిహార్ రాజధాని పాట్నకు చేరుకున్నారు.

22 Jun 2023

పాట్న

బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి దాదాపు 20 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు శుక్రవారం పాట్న వేదికగా సమావేశం కాబోతున్నారు.

కొవిన్‌ పోర్టల్ డేటా లీకేజీలో కీలక పరిణామం.. బిహారీని అరెస్ట్ చేసిన దిల్లీ ఇంటిలిజెన్స్  

కరోనా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొవిన్‌ పోర్టల్‌ ను తీసుకొచ్చింది. అయితే సదరు పోర్టల్ నుంచి సున్నితమైన సమాచార లీకులు దేశంలో సంచలనం రేపింది.

21 Jun 2023

ఆలయం

270 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ ఆలయ నిర్మాణం ప్రారంభం 

ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ రామాయణ మందిరం బీహార్ లో నిర్మితం కానుంది. ఈ మేరకు రాష్ట్రంలోని తూర్పు చంపారణ్‌ జిల్లా, కల్యాణ్‌పూర్‌ మండలం ( బ్లాక్ ), కైథవలియా గ్రామంలో మంగళవారం భూమి పూజ జరిగింది.

మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు 

బిహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.

08 Jun 2023

పాట్న

పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్

ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది.

08 Jun 2023

ఎన్ఐఏ

నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు 

2018లో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి బిహార్, జార్ఖండ్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం తెలిపింది.

బిహార్: కుప్పకూలిన రూ.1,700కోట్ల బ్రిడ్జి; గార్డ్ గల్లంతు 

బిహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే 

ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన విషాదకర ఘటనతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

బిహార్‌: ప్రశాంత్ కిషోర్‌కు గాయం; 'జన్ సూరాజ్' పాదయాత్రకు విరామం 

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గాయం కారణంగా బిహార్‌లో ఆయన నిర్వహిస్తున్న జన్ సూరాజ్ పాదయాత్రకు బ్రేక్ పడింది.

01 May 2023

దిల్లీ

దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు 

దిల్లీలో కారు ఈడ్చుకెళ్లిన ఘటన మరొకటి జరిగింది. దిల్లీలోని ఆశ్రమ్‌చౌక్‌ నుంచి నిజాముద్దీన్‌ దర్గా వరకు ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని కారు బానెట్‌కు తగిలించుకుని 3కిలో మీటర్లు పాటు లాక్కెళ్లింది.

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 

గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా? 

గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్ మోహన్ బిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆనంద్ మోహన్ విడుదల వార్త ఇప్పుడు బిహార్‌లో సంచలనంగా మారింది.

25 Apr 2023

ఎన్ఐఏ

పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సోమవారం హౌరాలో కలిశారు.

కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు 

రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.

స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు

కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుందని నిరూపించిన వారు ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్ కథ కూడా అలాంటి గొప్పవారికి ఏం తీసిపోనిది.

16 Mar 2023

సీబీఐ

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌‌ను విచారించేందుకు గురువారం సీబీఐ మరోసారి సమన్లను జారీ చేసింది.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది.

తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సీబీఐ శనివారం సమన్లు ​​జారీ చేయడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైర్ అయ్యారు. మహాఘ్‌బంధన్‌కు కట్టుబడి ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని బీజేపీపై విరుచుకుపడ్డారు.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు ​​పంపింది.

IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

06 Mar 2023

సీబీఐ

జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు.

18 Feb 2023

ఒడిశా

బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం

బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్‌టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు.

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

సోషలిస్టు నేత, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెళ్లడించారు. శరద్ యాదవ్‌కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.

09 Jan 2023

దిల్లీ

ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు

విమానాల్లో అసభ్యకర సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎయిర్ ఇండియాలో తోటి మహిళా ప్రయాణికులపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే.. ఇండిగో ఫ్లైట్‌లో మరో ఘటన జరిగింది.

'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు.

Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్

బిహార్‌కు చెందిన రాజు రామ్ అనే వ్యక్తి డ్రీమ్11 బెట్టింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కేవలం రూ.49లో బెట్టింగ్ పెట్టి రూ.కోటి జాక్ పాట్ కొట్టేశాడు. కొన్ని లక్షల మందిని ఓడించి మరీ.. రాజు రామ్ ఈ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

26 Dec 2022

కోవిడ్

కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు

అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం బిహార్ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

మునుపటి
తరువాత