Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్
బిహార్‌లోని నలంద జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం 40 అడుగుల బోర్‌వెల్‌లో పడిపోయిన 3 ఏళ్ల బాలుడిని ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సజీవంగా బయటకు తీశారు. కొన్ని గంటల పాటు ఎన్‌డీఆర్ఎఫ్ బృందం కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. బాలుడిని ప్రాణాలతో బయటికి తీశామని, అతను బాగానే ఉన్నాడని, ఆసుపత్రికి తరలించినట్లు ఎన్‌డీఆర్ఎఫ్ అధికారి రంజీత్ కుమార్ తెలిపారు. చిన్నారిని బయటికి తీయడానికి తమకు 5 గంటల సమయం పట్టిందని ఆయన వెల్లడించారు. రక్షించిన బాలుడి పేరు శివం కుమార్‌గా అధికారులు చెప్పారు. ఓ రైతు బోరుబావిని తవ్వి మూసేయకుండా వదిలేయడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.