NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన
    ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఒడిశా చేస్తున్న ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? అని అడిగిన ప్రశ్నకు పై విధంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు.

    రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించినా, ఆర్థిక సంఘం సూచన మేరకు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.

    ప్రత్యేక హోదా

    90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి: బీజేడీ

    ఒడిశా, బిహార్ రాష్ట్రాలు ఎప్పటి నుంచో ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం ప్రకృతి విపత్తులకు గురికావడం వల్ల కేంద్రం ఆదుకోవాలని బీజేడీ డిమాండ్ చేస్తోంది.

    ఇదే విషయాన్ని ఇటీవల బీజేడీ ఎంపీ సస్మిత్ కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఒడిశాలో తుఫాను వచ్చినప్పుడల్లా ఇళ్లు దెబ్బతింటున్నాయని, పంటలు నాశనమవుతున్నాయని, అటువంటి విపత్తు సంభవించినప్పుడు, కేంద్రం మూడేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని కోరారు.

    గతేడాది ఆగస్టులో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు.

    బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    ఆర్థిక శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్
    ఒడిశా

    తాజా

    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్

    ఆర్థిక శాఖ మంత్రి

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? బడ్జెట్ 2023

    ఆంధ్రప్రదేశ్

    ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే? భారతదేశం
    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు హైకోర్టు
    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు వై.ఎస్.జగన్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025