Page Loader
అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు
ఈ సమావేశం ఫిబ్రవరి 15న జరిగే అవకాశం ఉంది

అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 13, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ సమావేశం ఫిబ్రవరి 15న జరిగే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌ పతనమైన సమయంలో రెగ్యులేటర్ తీసుకున్న నిఘా చర్యలపై సెబీ బోర్డు ఆర్థిక మంత్రికి వివరించనుంది. లిస్టెడ్ ఎంటిటీలు మార్కెట్ విలువలో $100 బిలియన్ల కంటే ఎక్కువ నష్టపోయిన సమయంలో వచ్చిన అప్‌డేట్ గ్రూప్‌కి కీలకం అవుతుంది.

అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ పై చర్యలు కోసం న్యాయ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకున్న అదానీ గ్రూప్

ఈ నివేదిక వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్‌లో దాదాపు 20 రోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ల ఒత్తిడి మధ్య హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ పై చర్యలు చేపట్టేందుకు గ్రూప్ ఇటీవలే US రక్షణ న్యాయ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకుంది. అదానీ గ్రూప్ సంక్షోభం కూడా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తును డిమాండ్ చేశాయి. బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిబంధనలను వక్రీకరించిందని కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అదానీ గ్రూప్ భవిష్యత్తు సెబీ పరిశోధనలు, ఆర్థిక మంత్రితో దాని సమావేశంపై ఆధారపడి ఉంటుంది.