
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రాత్రి భీమవరంలో ఒక వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన, ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
సర్రాజు మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
పాతపాటి సర్రాజు మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
2014కు ముందు ఆయన వైసీపీలో చేరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో సర్రాజుకు టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో ఆయన్ను క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీఎం జగన్ నియమించారు.
2004లో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.