ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్/ఈడీ: వార్తలు
09 Jun 2023
బిహార్మైనింగ్ స్కామ్ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు
బిహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.
01 Jun 2023
దిల్లీఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు.
02 May 2023
దిల్లీదిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తన రెండో అనుబంధ ఛార్జిషీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చింది.
01 May 2023
బెంగళూరుఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల బెంగళూరులో ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆస్తులపై విచారణ చేపట్టింది. రవీంద్రన్ ఇల్లుతో పాటు కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించారు.
01 May 2023
థాయిలాండ్థాయ్లాండ్లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు
భారతదేశంలో ఫెమా ఉల్లంఘనల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్ లాండ్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
13 Apr 2023
బీబీసీవిదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీబీసీ ఇండియాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసింది.
05 Apr 2023
సుప్రీంకోర్టుప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
01 Apr 2023
హైదరాబాద్‌హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు
హైదరాబాద్‌లోని వివిధ ఫార్మా కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) శనివారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది.
30 Mar 2023
హైదరాబాద్డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.
27 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా
దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.
27 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(కేసీఆర్) కుమార్తె కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరగనుంది.
24 Mar 2023
సుప్రీంకోర్టుఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.
21 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మంగళవారం అధికారులు విచారిస్తున్నారు. మూడో దఫా విచారణలో భాగంగా కవిత ఇప్పటి వరకు తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించారు.
21 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. ఈ క్రమంలో అమె అరెస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.
17 Mar 2023
మనీష్ సిసోడియాదిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు
మద్యం పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5రోజులు పొడిగిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.
16 Mar 2023
ఆంధ్రప్రదేశ్దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు
దిల్లీ మద్యం పాలసీ కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఈ కేసులో విచారించేందుకు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు పంపింది.
16 Mar 2023
కల్వకుంట్ల కవితకవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 20న తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
16 Mar 2023
కల్వకుంట్ల కవితచివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ
దిల్లీ మద్యం పాలసీ కేసులో మరికొద్ది సేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు హాజరు కావాల్సిన భారత రాష్ట్ర సమితి నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు.
15 Mar 2023
కల్వకుంట్ల కవితఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ
దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు కె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
11 Mar 2023
కల్వకుంట్ల కవితదిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరుకానున్నారు.
10 Mar 2023
కల్వకుంట్ల కవితరేపు కవిత విచారణ; ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించాల్సి ఉండగా, శుక్రవారం అరుణ్‌రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
10 Mar 2023
లాలూ ప్రసాద్ యాదవ్IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
09 Mar 2023
దిల్లీతీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
07 Mar 2023
దిల్లీదిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్
దిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్లై 'సౌత్ గ్రూప్'కు ప్రాతినిధ్యం వహించారని అధికారులు తెలిపారు.
23 Feb 2023
దిల్లీదిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.
02 Feb 2023
దిల్లీదిల్లీ లిక్కర్ స్కామ్: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ గురువారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటం గమనార్హం. రెండో చార్జ్‌షీట్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కవిత, వైసీపీ ఎంపీ మాగుంట బాబుతో పాటు మొత్తం 12మంది పేర్లను ఈడీ ఇందులో చేర్చింది.