Page Loader
మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ ఇంట్లో సోదాలు  
మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ ఇంట్లో సోదాలు

మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీ ఇంట్లో సోదాలు  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2023
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం బుధవారం సోదాలు నిర్వహించింది. అంతకుముందు,ఈ కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి. మద్యం పాలసీ కేసులో దాఖలైన చార్జిషీట్‌లో సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించారు. సోదాలపై సంజయ్ సింగ్ తండ్రి స్పందించారు.డిపార్ట్‌మెంట్ తన పని చేస్తోందని, తాము వారికి సహకరిస్తామని తెలిపారు.

Details 

 ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రిని  కలిసినట్లు ఈడీకి తెలిపిన 

సంజయ్ కి క్లియరెన్స్ వచ్చే వరకు వేచి ఉంటామని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నివాసంలో ఎంపీ సంజయ్ సింగ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో నిందితుడిగా పేర్కొన్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా కలిశారు. అటు తరువాత అరోరా వేరే ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్‌ను కలిసినట్లు తెలిపారు. అనంతరం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కలిసినట్లు అరోరా ఈడీకి తెలిపారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.